ఏం ప్లాన్ చేశావ్ భాయ్
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం తన కొత్త సినిమా కార్యక్రమాల్లో బీజీగా ఉన్నాడు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తోన్న సైంటిఫిక్ మాస్ ఎంటర్టైనర్ ఇది. అల్లు అర్జున్ కు ఇది 22వ మూవీ. అలాగే- అట్లీకి ఇది ఆరో సినిమా. దీని వర్కింగ్ టైటిల్.. 'AA22 x A6'. 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్.. ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కబోతోంది అల్లు అర్జున్- అట్లీ మూవీ.
ఇప్పుడీ మూవీపై తాజా సమాచారం వెలువడింది. కొత్త పోస్టర్ విడుదల అయింది. ఓ కింగ్ కాంగ్ అరచేతితో కూడిన పోస్టర్ అది. అరచేతిని సగం వరకు మాత్రమే చూపారు ఇందులో. 'AA22 x A6' టైటిల్ రివీల్ ఏప్రిల్ 8 11 ఏఎం.. అనే అక్షరాలను ఓ మూలన ముద్రించారీ పోస్టర్ లో. అల్లు అర్జున్, సన్ పిక్చర్స్, అట్లీ ఈ పోస్టర్ ను తమ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ వెంటనే వైరల్ అయిందిది. ఎవ్వరూ ఊహించని విధంగా ఓ కింగ్ కాంగ్ చేతిని ఇందులో ప్రదర్శించడం అనేది షాక్ కు గురి చేసింది. సినిమాపై హైప్ ను పెంచింది.

అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తోన్న ఈ కొత్త మూవీ టైటిల్, టీజర్ రివీల్ కానుంది. చిత్ర బృందం సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌లను రేపు ఉదయం 11 గంటలకు ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఇండియన్ సినిమా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఇదీ ఒకటి. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా ఈ మూవీని తీస్తోంది. దీనికి అనుగుణంగా తాజాగా విడుదల అయిన పోస్టర్‌తో సినిమాపై హైప్ ను రెట్టింపు చేసింది.
సినిమా కథాంశం ఏమిటనేది ఈ టీజర్ పోస్టర్ ఏ మాత్రం కూడా రివీల్ చేయలేదు పైగా ఆసక్తిని పెంచింది. ఇప్పటివరకు అల్లు అర్జున్ గానీ, అట్లీ గానీ, యూనిట్ గానీ ఈ సినిమా కథాంశానికి సంబంధించిన చిన్న పాయింట్ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. దర్శకుడు అట్లీ దీనికి మరింత ట్విస్ట్ ఇచ్చారు. "లవ్ లెటర్ లోడింగ్.. టైటిల్ పోస్టర్ రేపు ఉదయం 11 AM #AA22xA6" అని పోస్ట్ చేశారు. జవాన్ తో అట్లీ, పుష్ప 1, పుష్ప 2తో అల్లు అర్జున్ తమ పాన్-ఇండియా స్టార్‌డమ్‌ను ఇప్పటికే నిరూపించుకున్నారు. మరో 1,000 కోట్ల సినిమా వైపు దూసుకెళ్తోన్నారు.
Title Poster tomorrow at 11 AM.#AA22xA6 pic.twitter.com/3do0GyDiFj
— Allu Arjun (@alluarjun) April 7, 2026
రేపు ఉదయం 11 గంటలకు టైటిల్, ఫస్ట్ లుక్ ఆవిష్కరణపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అది మాస్ ఎంటర్‌టైనర్, స్టైలిష్ యాక్షన్ చిత్రం, లేదా మరేదైనా ఊహించని కథాంశంతో సినిమా రూపుదిద్దకుందా అనేది తేలేది బుధవారం ఉదయం 11 గంటలకు తెలిసిపోతుంది. ఈ పోస్టర్ తో అల్లు అర్జున్ బర్త్ డే జాతర ఇప్పుడే మొదలైనట్టయింది.












Click it and Unblock the Notifications