ప్రమోషన్స్ విషయంలో ఈ డైరెక్టర్ తోపు అంతే.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ !!

తెలుగు చిత్ర పరిశ్రమలోని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా పేరొందారు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. అయితే అంతకు ముందు ఎన్నో చిత్రాలకు రైటర్‌గా పని చేశాడు. ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఘోస్ట్ రైటర్‌గానూ పని చేశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటివరకు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించాయి. ఆయన తెరకెక్కించిన చివరి చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేష్ హీరోగా వచ్చిన ఆ మూవీ భారీ హిట్ అందుకుంది. ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తుండగా.. భీమ్స్ సిసిరీలియో సంగీతం సమకూరుస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

anil-ravipudi-9-days-promotions-for-chiranjeevi-mana-shankara-varaprasad-garu-movie

ఈ క్రమంలోనే మూవీ యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. అయితే అనిల్ తన సినిమాలకు ఏ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఇప్పటికే సాంగ్స్, పోస్టర్స్ విషయంలో తనదైన శైలిలో ఆసక్తి కలిగిస్తూ అనిల్ ప్రమోషన్స్ అదరగొడితే.. ఇప్పుడు మరో తొమ్మిది రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ( జనవరి 4, 2025 ) ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. ఇక నుంచి అప్డేట్స్ నాన్ స్టాప్ గా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

9 రోజులు.. 9 ఈవెంట్స్..

నేడు తిరుపతిలోని ఎస్వీ సినీప్లెక్స్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత 9 రోజుల పాటు 9 ఏరియాలలో 9 ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

జనవరి 5 - నెల్లూరు

జనవరి 6 - విశాఖపట్నం

జనవరి 7 - హైదరాబాద్

జనవరి 8 - తాడేపల్లిగూడెం

జనవరి 9 - అనంతపూర్

జనవరి 10 - వరంగల్

జనవరి 11 - బెంగళూరు

ఈ విధంగా మొత్తం మూడు రాష్ట్రాలను కవర్ చేస్తూ తొమ్మిది రోజుల్లో పలు కార్యక్రమాలు ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఈసారి విక్టరీ వెంకటేష్, నయనతార కూడా ప్రచారంలో భాగం కాబోతున్నారని.. మెగాస్టార్ స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తారని సమాచారం. మరి అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్స్ తో ఎంతమేర సక్సెస్ అవుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+