బాలయ్య "అఖండ 2" దెబ్బకి అయోమయంలో 16 సినిమాలు ???

నటసింహం నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం "అఖండ 2". ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. అనూహ్య కారణాల వల్ల వాయిదా పడింది. కానీ మొత్తానికి అభిమానులను, సినీ ప్రేమికులను ఖుషి చేస్తూ అడ్డంకులు తొలగించుకొని డిసెంబర్ 12న ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. 11న ప్రీమియర్స్ ఉంటాయని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఈ మూవీ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా 'అఖండ' మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుండగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తమన్ మరోసారి తన సంగీతంతో స్పీకర్స్ బద్దలవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 'డాకు మహరాజ్'తో హిట్ అందుకున్న ఆయన.. మొత్తంగా వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ మూవీతో కూడా హిట్ కొట్టి సక్సెస్ జర్నీ కొనసాగించాలని భావిస్తున్నారు.

balakrishna-akhanda-2-movie-release-effect-on-16-other-movies

అయితే ఒక వైపు బాలయ్య మూవీ వస్తుందన్న ఆనందం ఒక వైపు ఉంటే.. మరో వైపు మాత్రం అదే రోజు విడుదలకు ప్లాన్ చేసుకున్న 16 సినిమాల పరిస్థితి ఏంటని జోరుగా చర్చ నడుస్తోంది. ముందుగా అనుకున్న తేదీకి "అఖండ 2" వాయిదా పడటం అందరినీ తీవ్ర నిరాశకు గురి చేసింది. అన్ని సరిగ్గా జరిగి ఉంటే డిసెంబర్ 5న అఖండ 2 విడుదల అవ్వాల్సింది. దాంతో చిన్న సినిమాలు అన్ని ఒక వారం గ్యాప్ తో 12న రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. కానీ ఇప్పుడు బాలయ్య సినిమా తేదీ మార్చుకోవడంతో ఆ చిన్న సినిమాల వ్యవహారం అయోమయంలో పడింది.

డిసెంబర్ 12న విడుదల కాబోతున్న 16 సినిమాలు..

మోగ్లీ..

యాంకర్ సుమ-రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల ఈ చిత్రంతో పూర్తి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'కలర్ ఫోటో' సినిమాతో నేషనల్ అవార్డు సాధించిన సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది.

సైక్ సిద్ధార్థ్..

హీరో నందు ప్రధాన పాత్రలో చేసిన 'సైక్ సిద్ధార్థ్' కూడా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, పోస్టర్లు ఈ సినిమాను యువతలో చర్చనీయాంశంగా మార్చాయి.

ఇట్స్ ఓకే గురు..

చరణ్ సాయి హీరోగా.. ఉషశ్రీ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం "ఇట్స్‌ ఓకే గురు". సుధాకర్ కోమాకుల కీలక పాత్రలో నటించిన ఈ మూవీని మణికంఠ దర్శకత్ వహించారు. వండర్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సురేష్ అనపురపు, బస్వా గోవర్ధన్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అన్నగారు వస్తారు ( డబ్బింగ్ )..

తమిళ్ హీరో కార్తీ నటిస్తున్న ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

డ్రైవ్ - (డబ్బింగ్)

లాక్‌డౌన్ - (డబ్బింగ్)

మిన్స్టీరియోస్

ఈషా

సకుటుంబనాం

నా తెలుగోడు

పైసావాలా

ఫెయిల్యూర్ బాయ్స్

వన్ బై ఫోర్

ఘంటసాల

కామ అండ్ డిజిటల్ సూత్రాస్

చిన్న సినిమాలు మినహాయిస్తే మోగ్లీ, సైక్ సిద్దార్ధ్, అన్నగారు వస్తారు, ఇట్స్ ఒకే గురు వంటి చిత్రాలకు మంచి బజ్ ఉంది. మరి ఈ తరుణంలో బాలయ్య సినిమా వస్తే వాటికి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+