Balakrishna:రజినీకాంత్ జైలర్-2 నుంచి బాలయ్య ఔట్..?

ఒక ఇండస్ట్రీలు స్టార్‌‌డమ్‌ను ఎంజాయ్ చేస్తూనే మరో ఇండస్ట్రీలో ప్రయోగాలు చేస్తూ మన వెటరన్ హీరోలు బాగానే సక్సెస్ అవుతున్నారు. తమ భాషలో చిత్రాలు చేస్తూనే ఇతర భాషల్లో కూడా మంచి పాత్రలు పోషిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇది ఎక్కువగా తమిళ తెలుగు చిత్ర పరిశ్రమలో కనిపిస్తున్న ట్రెండ్. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నటులు కూడా తెలుగు తమిళ కన్నడ మలయాలం వైపు అడుగులు వేస్తున్నారు. తాము చేస్తున్న ఎక్స్‌పెరిమెంట్లు సక్సెస్ అవడంతో ఇతర భాషల్లోను కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటి వరకు మరో భాషకు సంబంధించి స్ట్రెయిట్ సినిమాలో నందమూరి బాలకృష్ణ నటించింది లేదు. అయితే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ నటిస్తోన్న జైలర్ 2 చిత్రంలో నందమూరి నటసింహం బాలయ్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్త జోరుగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడింది.

బాలయ్యకు షాక్..!!
అఖండ 2 ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న బాలయ్యకు ఇది షాకింగ్ వార్తే అవుతుంది. రజినీకాంత్ నటిస్తోన్న జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ ఒక ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. అయితే ఇప్పుడు బాలయ్య ఆ సినిమా నుంచి తప్పించేశారనే వార్త ప్రచారంలో ఉంది. కోలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రజినీకాంత్ స్టారర్ జైలర్ 2 నుంచి బాలయ్య తనకు తానే తప్పుకున్నాడా లేక తప్పించారా అనే చర్చ జరుగుతోంది. ఎందుకు తప్పుకున్నారు లేదా తప్పించారనే విషయాన్ని మాత్రం ఎవరూ వెల్లడించడం లేదు. పైగా బాలయ్య కోసం రాసుకున్న పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తారని టాక్.

balakrishna-replaced-by-vijay-sethupathi-in-rajini-starrer-jailer-2

ఇందుకోసం ఇప్పటికే విజయ్ సేతుపతి జైలర్ 2 షూటింగ్‌లో కూడా పాల్గొన్నారట.తన పాత్రకు సంబంధించి చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్ కొన్ని రోజుల పాటు జరగనున్నట్లు సమాచారం. అతిథి పాత్ర అయినప్పటికీ విజయ్ సేతుపతిది మాంచి బలమున్న ప్రాధాన్యత ఉన్న పాత్రగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే రజినీకాంత్‌తో విజయసేతుపతి జత కట్టడం ఇది రెండో సారి అవుతుంది. 2019లో కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసిన పెట్టా చిత్రంలో నటించి రజినీతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు సేతుపతి. అందులో విలన్ పాత్రలో విజయ్ కనిపించారు.

వేసవిలో రిలీజ్
ఇక జైలర్-2 విషయానికొస్తే నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చిత్రీకరణ పూర్తి చేసుకుంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. వేసవికాలంలో జైలర్-2ను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే విడదుల తేదీపై మూవీ మేకర్స్ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన జైలర్‌కు సీక్వెల్‌గా జైలర్ 2 చిత్రం రాబోతోంది. తొలి భాగం ఎక్కడైతే ముగించారో అక్కడి నుంచి రెండో భాగం కంటిన్యూ అవుతుంది. ఇక జైలర్ 2లో అలనాటి బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్‌లు కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే రజినీకాంత్ నటించి చివరి చిత్రం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లోని కూలీ చిత్రం. అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక జైలర్ 2పై ఇటు చిత్ర యూనిట్ అటు రజినీ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దీని తర్వాత తలైవర్ కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌజ్‌లో ఓ చిత్రం చేయనున్నట్లు కోలీవుడ్ టాక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+