టాప్ ప్లేస్ లో చిరు- చరణ్: మధ్యలో నలిగిపోతున్న బాలయ్య

గానా, మిర్చి ప్లస్ ప్లాట్ ఫామ్ లపై రామ్ చరణ్ సందడి చేస్తోన్నాడు. చికిరి చికిరి సాంగ్ తో దుమ్ము రేపుతున్నాడు. మెగా పవర్ స్టార్ నటిస్తోన్న అప్ కమింగ్ మూవీ పెద్దిలోని ఈ పాట ముందు అన్నీ దిగదుడుపే అవుతున్నాయి. ట్రెండింగ్ లో టాప్ లో కొనసాగుతోంది. అఖండ తాండవం సైతం దీని తర్వాతే నిలిచింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ వర్షన్ లోనూ ప్రభంజనం రేపుతోందీ చికిరి చికిరి పాట.

ఈ నెల 1 నుండి 5 వరకు ట్రెండ్ అవుతున్న 'మిర్చి టాప్ 20 ప్లేలిస్ట్' సంగీత ప్రియులను చికిరి చికిరి ఉర్రూతలూగిస్తోంది. మోహిత్ చౌహాన్, బాలాజీ ఈ పాటను పాడారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. సోషల్ మీడియాలోనూ ఈ పాట హవా సాగుతోంది. చాలామంది- దీన్ని ఇమిటేట్ చేస్తూ ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లల్లో పోస్ట్ చేసిన వీడియోలు కోకొల్లలు. మిర్చి టాప్ 20 ప్లేలిస్ట్ లో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల పైనా సత్తా చాటుతోంది.

Chikiri Chikiri and Meesala Pilla rule the mirchi plus playlist with Top 2 positions

దీని తర్వాత రెండో స్థానంలో నిలిచింది.. మీసాల పిల్ల. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా మూవీ.. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని పాట ఇది. అనిల్ రావిపూడి దర్శకుడు. చిరంజీవి సరసన నయనతార నటిస్తోన్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకం కింద సాహు గారపాటి, సుష్మ కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.

ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఈ పాటను పాడారు. భాస్కరభట్ల రవికుమార్ ఈ పాటను రాశారు. భీమ్స్ సిసిరోలియో దీనికి సంగీతాన్ని సమకూర్చారు. మిర్చి టాప్ 20 ప్లేలిస్ట్ లో మూడో స్థానంలో నిలిచింది అఖండ తాండవం. శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్, దీపక్ బ్లూ ఈ పాటను పాడారు. తమన్ ప్రాణం పోశారీ పాటకు. నందమూరి బాలయ్య నటించిన ఈ మూవీ నిజానికి ఈ నెల 5వ తేదీ నాడే విడుదల కావాల్సి ఉన్నప్పటి సాధ్యం కాలేదు.

నాలుగు, అయిదు స్థానాల్లో భీమవరం బాల్మా, వైబ్ ఉంది.. పాటలు ఉన్నాయి. అనగనగా ఒక రాజు సినిమాలోని పాట భీమవరం బాల్మా. నవీన్ పొలిశెట్టి, నూతనా మోహన్ ఈ పాటను పాడారు. చంద్రబోస్ రాసిన పాట ఇది. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. మిరాయ్ సినిమాలోని వైబ్ ఉంది.. పాట అయిదో స్థానంలో నిలిచింది. అర్మాన్ మాలిక్ ఈ పాటను పాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+