ప్రభాస్ "రాజాసాబ్" పై ఫ్యాన్ "బూతు" కామెంట్... మారుతి కౌంటర్ !!
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుల్లో మారుతి ఒకరు. షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ కంటెంట్‌తో ప్రారంభించిన మారుతి.. "మధురవాణి టాకీస్" బ్యానర్ ద్వారా పలు షార్ట్ ఫిల్మ్స్ నిర్మిస్తూ యువతలో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత అదే శైలిలో కొత్త ఆలోచనలతో వెండి తెరపైకి అడుగుపెట్టారు. తక్కువ బడ్జెట్ సినిమాలతో కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత వరుసగా కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. ముఖ్యంగా యువత, కుటుంబ ప్రేక్షకుల్లో ఆయన చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది.
ఫిల్మ్ కెరీర్..
2011లో విడుదలైన 'ఈ రోజుల్లో' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా యువతలో సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం దర్శకుడిగా పేరు తెచ్చిపెట్టాయి. ఇక 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రతి రోజు పండగే' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించి కొత్త దర్శకులు, కొత్త నటులను ప్రోత్సహిస్తున్నారు.

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం "రాజాసాబ్". ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాజాసాబ్ మూవీ టీం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది.
ఈ క్రమంలోనే మారుతి అటు ఆఫ్ లైన్ ఇటు ఆన్ లైన్ అన్నీ కవర్ చేసేస్తూ ఫుల్ గా బిజీగా ఉంటున్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూనే.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించారు. అయితే ఓ ఫ్యాన్ మాత్రం కొంచెం హద్దు దాటి బూతు కామెంట్ చేశారు. అందుకు మారుతి సైతం అందుకు తగ్గట్టు గానే కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ రెండు ఫుల్ వైరల్ అవుతున్నాయి.













Click it and Unblock the Notifications