కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్
మాచోస్టార్ గోపీచంద్ నటిస్తోన్న లేటెస్ట మూవీ.. భరతవర్ష- సాగా ఆఫ్ శూల. గోపీచంద్ నటిస్తోన్న 33వ సినిమా ఇది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ ఇది. రీతూ వర్మ కథానాయిక. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. దీని టైటిల్ గ్లింప్సెస్ కొద్దిసేపటి కిందటే విడుదల అయ్యాయి. ఈ సినిమా 642 AD నాటి శూల రాజ్యానికి మనల్ని తీసుకెళ్లినట్టనిపించిందీ గ్లింప్సెస్ చూస్తోంటే.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ వెల్లడి కావొచ్చు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా టైటిల్‌ను ప్రకటించింది. గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఓ వారియర్ గా అతని క్యారెక్టర్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చింది. అద్భుతమైన యాక్షన్ దృశ్యాలతో సాగుతుందీ 55 సెకెండ్ల నిడివి ఉండే టైటిల్ గ్లింప్సెస్. భరతవర్ష ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ చిత్రం హైబడ్జెట్ తో తెరకెక్కుతోంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఓ యోధుడిగా కనిపించాడు గోపీచంద్. ఈ చిత్రంలో పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనున్నాడు. ఓ యోధుడి పాత్ర కోసం అద్భుతంగా మేకోవర్ అయ్యాడు. విజువల్ వండర్ అనిపించింది. మనం మరచిపోయిన యుగాన్ని కళ్ళముందుంచాయి ఇందులోని సన్నివేశాలు. భారీతనం, హైఓల్టేజ్ యాక్షన్ కలబోసిన ఈ కథనం వీరోచితంగా అనిపిస్తుంది.
An ancient era rises with the Saga of Shula.#BharataVarsha it is!
— T Gopichand (@YoursGopichand) April 13, 2026
- https://t.co/NmUPgxgI8n#Sankalp @SS_Screens pic.twitter.com/IF1p5GcMEg
సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, చిన్నా నిర్మాణ రూపకల్పన, అనుదీప్ దేవ్ సంగీతం కట్టి పడేశాయి. ఆయా టెక్నికల్ వాల్యూస్ అన్నీ కూడా సినిమా స్థాయిని పెంచాయి. దేశ చరిత్రలోని మరుగునపడిన ఓ అధ్యాయాన్ని శక్తివంతంగా ఆవిష్కరించబోతోందీ ఫిల్మ్. ప్రాచీన యుగ నేపథ్యంతో, అప్పటి పరాక్రమం, వారసత్వం, నమ్మకాలు- ఆచార వ్యవహారల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. శ్రీనివాస చిట్టూరి అందించిన నిర్మాణ విలువలు అసాధారణమైనవి. అనుదీప్ దేవ్ నేపథ్య సంగీతం, యాక్షన్ సెటప్ సినిమాపై అంచనాలను పెంచాయి.












Click it and Unblock the Notifications