Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్కెచ్ సక్సెస్ అయ్యిందా.. "గుర్రం పాపిరెడ్డి" మూవీ రివ్యూ..?

ప్రతి వారం థియేటర్లలోకి ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తూనే ఉంటాయి. అయితే 2025 ఏడాదిలోని చివరి నెల అయిన డిసెంబర్ పై ఫిల్మ్ లవర్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మొదటి వారం మాత్రం మూవీ లవర్స్‌ను నిరాశపరచగా.. రెండవ వారంలో నందమూరి బాలకృష్ణ "అఖండ 2"తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక మూడో వారంలో హాలీవుడ్ భారీ చిత్రం 'అవతార్' బాక్సాఫీస్‌ను ఊపేస్తుంది.

అయితే ఇంతటి కాంపిటీషన్ లో కూడా తగ్గేదే లేదంటూ టాలీవుడ్ నుంచి వచ్చిన కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఆ జాబితాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా 'గుర్రం పాపిరెడ్డి'. నరేష్ అగస్త్య హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. డార్క్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. మరి డిసెంబర్ 19న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ.. ప్రేక్షకుల మనసులు గెలుచుకుందో లేదో తెలుసుకుందాం..

gurram-papireddy-movie-telugu-review-and-rating

సినిమా కథ..

ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య) త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో బ్యాంక్ దొంగతనానికి ప్రయత్నిస్తాడు. తన స్నేహితులు మిలటరీ (కసిరెడ్డి రాజ్ కుమార్), చిలిపి (వంశీధర్ గౌడ్), గొయ్యి (జీవన్) లతో కలిసి చేసిన ఆ రాబరీ విఫలమవుతుంది. ఈ ఘటనలో ఉడ్రాజు (యోగిబాబు) నగలు, వజ్రాలతో పారిపోతే, పాపిరెడ్డి గ్యాంగ్ జైలుకు వెళ్తుంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పాపిరెడ్డి, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే సౌదామిని (ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది.

ఇక ఈసారి చిన్న దొంగతనం కాదు... వేల కోట్ల ఆస్తిపై కన్నేసిన ఒక అతి పెద్ద స్కెచ్ వేస్తాడు. శ్రీశైలం అడవుల్లో ఉన్న ఒక శవాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చి, క్రిష్ణానగర్ శ్మశానవాటికలో కళింగ పోతురాజు సమాధిలో పూడ్చి, ఆ శవాన్ని ఆధారంగా చేసుకుని కళింగ వంశీయుల ఆస్తులపై కేసు వేయాలన్నది వీరి ప్లాన్. ఈ స్కెచ్ ఎంతవరకు సక్సెస్ అయింది? గొయ్యిని కళింగ వంశీయుడిగా నిరూపించగలిగారా? ఈ వ్యవహారంలో జడ్జ్ పాత్రలో బ్రహ్మానందం ఎలా కీలకంగా మారాడు? చివరికి ఈ స్టుపిడిటీ జర్నీ ఎక్కడికి దారితీసిందన్నది మిగతా కథ.

మూవీ విశ్లేషణ..

తెలుగు తెరపై డార్క్ కామెడీ చిత్రాలు అప్పుడప్పుడు వస్తున్నప్పటికీ, అన్నీ ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. పేపర్‌పై బాగున్న ఐడియా, తెరపై అమలు చేసే సమయంలో తడబడటం చాలా సినిమాల్లో కనిపించింది. అయితే డార్క్ కామెడీ జోనర్‌లో 'గుర్రం పాపిరెడ్డి' ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే చెప్పాలి. సినిమా ప్రారంభంలోనే జడ్జ్ పాత్రలో బ్రహ్మానందం "స్టుపిడిటీ" గురించి చెప్పే మోనాలాగ్‌తో కథ మొదలవుతుంది. ఆ తర్వాత స్టుపిడిటీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పాత్రలు చేసే క్రేజీ పనులే కథ మొత్తం ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం లౌడ్‌గా, ఓవర్ స్టుపిడ్‌గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల చిరాకు కూడా తెప్పిస్తుంది.

కానీ కథ ముందుకు సాగేకొద్దీ అదే స్టుపిడిటీ కామెడీగా మారి నవ్వులు పూయించడం మొదలుపెడుతుంది. బ్యాంక్ రాబరీ ఫెయిల్యూర్, శవం దొంగిలించే సన్నివేశాలు, ప్లాన్ అమలు చేసే క్రమంలో పాత్రల మధ్య వచ్చే గొడవలు హైలైట్. సెకండ్ హాఫ్‌లో కామెడీ మరింత సహజంగా వర్కౌట్ అవుతుంది. కోర్ట్ సన్నివేశాలు, సాక్షాల విషయంలో చేసే స్టుపిడ్ పనులు బాగా నవ్విస్తాయి. క్లైమాక్స్‌లో నరేష్ అగస్త్య ఇచ్చిన ట్విస్ట్ సినిమాకు ప్లస్ అయ్యింది.

నటీనటుల ప్రదర్శన..

నరేష్ అగస్త్య - పాపిరెడ్డి పాత్రలో అదరగొట్టాడు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రగా నిలుస్తుంది.

ఫరియా అబ్దుల్లా - సౌదామినిగా చురుకైన నటనతో మెప్పించింది.

జీవన్ (గొయ్యి పాత్ర) - సినిమాకే పెద్ద ప్లస్. ఆద్యంతం నవ్వులు పూయిస్తాడు.

బ్రహ్మానందం - చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయి పాత్రలో కనిపించి నవ్వించారు.

యోగిబాబు - చిన్న పాత్రైనా తన మార్క్ కామెడీతో హిలేరియస్‌గా ఉన్నాడు.

కసిరెడ్డి రాజ్ కుమార్, వంశీధర్ గౌడ్ తమ టైమింగ్‌తో బాగా ఆకట్టుకున్నారు.

సాంకేతిక అంశాలు..

కృష్ణ సౌరభ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా నిలిచింది. అర్జున్ రాజా విజువల్స్ ఫర్వాలేదు, ఇంకా బెటర్ చేయవచ్చు. ఎడిటింగ్ షార్ప్‌గా ఉన్నా, ఫస్ట్ హాఫ్‌లో మరింత కత్తిరింపు అవసరం అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

హైలైట్స్ & మైనస్‌లు..

హైలైట్స్:

డార్క్ కామెడీ కాన్సెప్ట్

గొయ్యి పాత్ర

బ్రహ్మానందం కోర్ట్ సీన్స్

క్లైమాక్స్ ట్విస్ట్

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

మైనస్‌లు:

ఫస్ట్ హాఫ్‌లో ఓవర్ లౌడ్నెస్

కొన్ని చోట్ల లాజిక్ మిస్

కథ అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్

రేటింగ్ - 2.75

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+