మొన్న బన్నీ, నిన్న ప్రభాస్..: ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ.. మన శంకర వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతోంది. ఈ రాత్రి నుంచే ఈ సినిమా సందడి నెలకొనబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు. ప్రత్యేక ప్రీమియర్లు, టికెట్ రేట్లను పెంచుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీసైతం చేశాయి.

ఈ ధరల పెంపు, ప్రత్యేక షోలు ఏపీ, తెలంగాణల్లో వారం రోజుల పాటు అమలులో ఉంటాయి. తెలంగాణలో ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయించారు. ఏపీలో కొంత తక్కువే. ఇక్కడ ఒక్కో ప్రీమియర్‌ షో టికెట్ 500 రూపాయలుగా నిర్ధారించారు. తెలంగాణలో రెగ్యులర్ షోలకు సింగిల్ స్క్రీన్‌లలో 227 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 395 రూపాయలు. ఏపీలో రెగ్యులర్ షోలకు సింగిల్ స్క్రీన్‌లలో 247 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 302 రూపాయలు వసూలు చేస్తారు.

Harish Rao Weighs In on Telangana Movie Ticket Price Increases

టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం ఎట్లకేలకు కొలిక్కి వచ్చినప్పటికీ.. ఇందులో చోటు చేసుకుంటోన్న తీవ్ర జాప్యం ఇప్పుడు రాజకీయ రంగు పులముకుంటోంది. దీనిపై తాజాగా భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టీ హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఓ పరిశ్రమగా చూడాల్సిన సినిమా రంగాన్ని రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారని మండిపడ్డారు.

టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని హరీష్ రావు విమర్శించారు. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఒక హీరో నటించిన సినిమాకు అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వట్లేదని, మరో హీరో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో అనుమతులు ఇస్తోన్నారని అన్నారు. ఇక వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష కట్టారని, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపించారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ పెద్దలకు నచ్చిన హీరో సినిమాకు 600 రూపాయల వరకు టికెట్ రేటు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ఓ నాయకుడు ఇప్పుడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడని, సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో, ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతామని హరీష్ రావు హెచ్చరించారు. ఆ శాఖ మంత్రికి కూడా తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+