హొంబలే ఫిల్మ్స్, సన్ పిక్చర్స్ తో మహేష్ కొలాబరేట్..వారణాసికి మించి?

సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం వారణాసి. పాన్ వరల్డ్ లెవెల్ లో చిత్రీకరణ జరుపుకొంటోందీ మూవీ. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్లెస్ ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఇచ్చాయి. సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. రుద్రగా గతంలో ఎప్పుడూ చేయని రోల్ లో మెరుపులు మెరిపించబోతోన్నాడు మహేష్ బాబు. ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ది ఇందులో కీ రోల్.

ఈ సినిమా 2027, ఏప్రిల్ 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని ఇదివరకే వారణాసి యూనిట్ అధికారికంగా వెల్లడించింది. Let it bang..VARANASI ON APRIL 7th, 2027 అని అధికారికంగా ప్రకటించింది. ఎక్స్ అకౌంట్ లో దీన్ని షేర్ చేసింది. విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ ఓ న్యూ పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. అంతరిక్షం నుంచి దూసుకొచ్చిను ఓ భారీ ఉల్క.. భూమిని బద్దలు కొట్టేలా ఢీ కొట్టేలా డిజైన్ చేసిన పోస్టర్ అది. ఇది 7 ఆకారంలో కనిపించింది.

Hombale Films and Sun Pictures Reportedly Convene with Mahesh Babu Over a New Project after Varanasi

వచ్చే ఏడాది జనవరి/ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తి కావొచ్చు. గ్రాఫిక్స్, ఇతరత్రా ప్యాచ్ వర్క్ ను పూర్తి చేసుకుని సినిమా ఏప్రిల్ 7న విడుదల అవుతుంది. దీని తర్వాత మహేష్ బాబు చేయబోయే నెక్స్ట్ ఫిల్మ్ ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుతానికి మహేష్ బాబు ఏ కొత్త సినిమాకూ కమిట్ కాలేదు. ఏ ప్రాజెక్ట్ కు కూడా ఇంకా సంతకం చేయలేదు గానీ.. రెండు బిగ్ బ్యానర్లు ఆయనను సంప్రదిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఈ రెండూ కూడా భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించేవే. ఒకటి- హోంబలే ఫిల్మ్స్, రెండు సన్ పిక్చర్స్. కేజీఎఫ్, కాంతారా సిరీస్ లను తెరకెక్కించిన ఘన చరిత్ర ఉంది హొంబలే ఫిల్మ్స్ కు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార, కాంతారా ఛాప్టర్ 1 మూవీలు.. ఏ రేంజ్ లో ఆడాయో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. అలాగే సన్ పిక్చర్స్ కూడా. జైలర్, కూలీ.. వంటి భారీ బడ్జెట్ సినిమాలు ఈ బ్యానర్ సొంతం. ప్రస్తుతం అల్లు అర్జున్- అట్లీ కాంబో, జైలర్ 2ను నిర్మిస్తోందీ బ్యానర్.

ఈ రెండు బ్యానర్లు మహేష్ బాబుతో సంప్రదింపులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కమిట్ మెంట్ కోసం ఎదురు చూస్తోన్నారు. బౌండ్ స్క్రిప్ట్, దర్శకుడు ఖరారైతేనే ఈ రెండు బ్యానర్లకు కూడా సినిమాలు చేయాలని మహేష్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఆయనను సంప్రదించింది. నిర్మాత నవీన్ ఎర్నేని మహేష్‌ను పలుమార్లు కలిసి, తదుపరి ప్రాజెక్ట్, దర్శకుల ఎంపికపై చర్చలు జరిపినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+