యూట్యూబ్ స్టార్ నాగదుర్గ ఒక్క పాటకు అంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా..?
ప్రస్తుతం యూట్యూబ్‌లో విడుదలవుతున్న ఆల్బమ్ పాటలు సైతం మిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయి. వాటిలో నటించిన కళాకారులు కూడా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందుతున్నారు. వీరిలో తెలంగాణ బిడ్డ నాగదుర్గ కూడా ఒకరు. తనడైన శైలిలో జానపద గీతాలతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. "దారిపొంటత్తుండు," "నా పేరు ఎల్లమ్మ," "ఎర్ర రుమాల్," "కాపోళ ఇంటికాడ" వంటి పాటలతో విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. దీంతో యూట్యూబ్ స్టార్ గా ఎదిగారు.
ఈ క్రమంలోనే ఆమె చేసిన పెద్దిరెడ్డి సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. బుల్లెట్టు బండి ఫేమ్ బండి లక్ష్మణ్ రాసిన ఈ పాట.. ఓ తండ్రిపై కూతురు చూపించే ప్రేమ నేపథ్లో సాగుతోంది. ఈ సాంగ్ ని మమత రమేష్ పాడగా.. మదన్ కే మ్యూజిక్ అందించారు. పచ్చని పోలాల మధ్యలో తెరకెక్కిన ఈ సాంపాటలో నాగదుర్గ లుక్స్, డాన్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మిలియన్లలో వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతుంది ఈ పాట.

అలానే యూట్యూబ్ లోనే కాకుండా తెరపై కూడా అలరిస్తున్నారు నాగదుర్గ. "కలివనం" అనే తెలుగు సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించినప్పటికీ.. ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. రీసెంట్ గానే తమిళ చిత్రసీమలోకి కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ప్రముఖ నటుడు ధనుష్ మేనల్లుడు పవీష్.. నటిస్తున్న కొత్త చిత్రంలో నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రం విజయవంతమైతే నాగదుర్గకు తమిళంలో మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. గత సంవత్సరం "జాబిలమ్మ నీకు అంత కోపమా" అనే డబ్బింగ్ చిత్రంతో పవీష్ హీరోగా పరిచయమయ్యారు.
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల తన యూట్యూబ్ ప్రయాణంలో సుమారు 300 పాటలు చేశానని వెల్లడించారు. రెమ్యూనరేషన్ విషయంలో కూడా తన కెరీర్ మొదట్లో తీసుకున్న దానికి ఇప్పుడు తేడా ఉందని తెలిపారు. పాట నచ్చితే రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
-
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
నా కథను మానభంగం చేసేశారు..! -
"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" -
గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా? -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి -
ఆ సినిమా వదులుకోవడమే ప్రభాస్ కెరీర్‌కు ‘శ్రీరామరక్ష’












Click it and Unblock the Notifications