ఏం స్కెచ్ వేశావ్ జక్కన్నా: వారణాసిలో కన్నడ సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం వారణాసి. పాన్ వరల్డ్ లెవెల్ లో చిత్రీకరణ జరుపుకొంటోందీ మూవీ. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్లెస్ ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఇచ్చాయి. సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. రుద్రగా గతంలో ఎప్పుడూ చేయని రోల్ లో మెరుపులు మెరిపించబోతోన్నాడు మహేష్ బాబు. ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ది ఇందులో కీ రోల్.
ఎం.ఎం. కీరవాణి సంగీతం, వీ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వారణాసి యూనిట్ ఇదివరకే అధికారికంగా వెల్లడించింది. విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ ఓ న్యూ పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. అంతరిక్షం నుంచి దూసుకొచ్చిను ఓ భారీ ఉల్క.. భూమిని బద్దలు కొట్టేలా ఢీ కొట్టేలా డిజైన్ చేసిన పోస్టర్ అది. ఇది 7 ఆకారంలో కనిపించింది. వచ్చే ఏడాది జనవరి/ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తి కావొచ్చు.

ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కీలక పాత్ర పోషించనున్నట్లు తాజాగా సినీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈగ తర్వాత రాజమౌళి, సుదీప్ కాంబినేషన్లో రానున్న మరో చిత్రం ఇదే అవుతుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి ది బిగినింగ్ లో కూడా మెరిశాడు సుదీప్. చిన్న పాత్రే అయినా గుర్తుండిపోతుందది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వారణాసిలో సుదీప్‌కు ముఖ్యమైన పాత్ర దక్కిందని చెబుతున్నారు.
విజువల్ వండర్ గా తెరకెక్కుతోందీ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్. గ్రాఫిక్స్, ఇతరత్రా ప్యాచ్ వర్క్ ను పూర్తి చేసుకుని సినిమా ఏప్రిల్ 7న విడుదల అవుతుంది. సినిమా చిత్రీకరణ దాదాపు 50 శాతం పూర్తయింది. సినిమా మొత్తానికీ హైలైట్.. రామాయణం ఎపిసోడ్. అత్యంత సవాల్ తో కూడుకున్నది కూడా. ఈ ఎపిసోడ్ లోనూ కిచ్చ సుదీప్ కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఆ క్యారెక్టర్ కు అతనైతేనే సూట్ అవుతాడని రాజమౌళి భావిస్తున్నారు. సుదీప్ ఎంట్రీపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications