సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో- ఫస్ట్ లుక్ లో మాస్ అప్పీయరెన్స్

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు. హీరో రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. జయకృష్ణ అరంగేట్రం చేస్తోన్న శ్రీనివాస మంగాపురం సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది. రమేష్ తమ్ముడు మహేష్ బాబు ఈ లుక్ ను ఆవిష్కరించాడు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అతనికి బెస్ట్ విషెస్ చెప్పాడు.

దీంతో కృష్ణ కుటుంబం నుంచి మూడో తరం హీరో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినట్టయింది. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తోన్న శ్రీనివాస మంగాపురం సినిమాను ప్రముఖ నిర్మాత సీ అశ్వనీదత్ సమర్పిస్తోన్నారు. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ కింద ఈ సినిమా తెరకెక్కుతోంది. పీ కిరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు తమిళ సంచలనం జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. మహేష్ బాబు ఎంట్రీ కూడా అశ్వనీదత్ సినిమాతోనే మొదలైన విషయం తెలిసిందే. రాజకుమారుడు మూవీని ఆయనే నిర్మించారు.

Mahesh Babu Unveils 1st Look of Nephew JayaKrishna in Srinivasa Mangapuram

ఈ ఫస్ట్ లుక్ లో అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ లో కనిపించాడు జయకృష్ణ. రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్ పై చేత్తో గన్ పట్టుకుని సీరియస్ లుక్స్ లో అదరగొట్టాడు. ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నాడు. డెబ్యూ ఆఫ్ ది ఇయర్ 2026 గా జయకృష్ణ ను ఇంట్రడ్యూస్ చేసింది చిత్రం యూనిట్. బాలీవుడ్ నటి రషా థదాని హీరోయిన్ గా నటిస్తోన్నారు. ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని తెరకెక్కిస్తోన్నారు. తిరుపతి బ్యాక్ గ్రౌండ్ గా సినిమా రూపుదిద్దుకుంటోంది.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+