ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం- మలయాళ స్టార్ హీరో కన్నుమూత

ప్రముఖ మలయాళ నటుడు, రచయిత, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. ఆయనకు భార్య విమల, కుమారులు వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ ఉన్నారు. వినీత్, ధ్యాన్ ఇద్దరూ నటులే. గాయకులు, దర్శకులుగా మలయాళ చిత్ర పరిశ్రమలో రాణిస్తోన్నారు. శ్రీనివాసన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు.

దశాబ్దాల పాటు తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారాయన. మలయాళ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా వెలుగొందారు. 1956, ఏప్రిల్ 6వ తేదీన కేరళలోని తలస్సేరి సమీపంలోని పత్యంలో జన్మించారు శ్రీనివాసన్. ఆయన తండ్రి స్కూల్ టీచర్. కాదిరూర్ లో చదువుకున్నారు. మట్టనూర్ లోని ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. అనంతరం నటన పట్ల ఆసక్తితో చెన్నైలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యారు.

Malayalam film legend Sreenivasan passes away at 69

ప్రముఖ మలయాళ దర్శకుడు పీఏ బాకర్ ఆయనకు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. 1977లో ఆయన దర్శకత్వం వహించిన 'మణిముళక్కం' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు శ్రీనివాసన్. దాదాపు అయిదు దశాబ్దాల పాటు కొనసాగారు. 225కు పైగా సినిమాల్లో నటించారు. తన పదునైన సామాజిక వ్యంగ్యం, చిరస్మరణీయ నటనతో మలయాళ అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించారు. ఆయన చిత్రాలలో హాస్యం, సామాజిక వ్యాఖ్యానం కలగలిసి ఉండేవి.

నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా శ్రీనివాసన్ రాణించారు. గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ కూడా. దర్శక- నిర్మాతగా పలు సినిమాలను తీశారు. ఎన్నో ఐకానిక్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నాయి. వ్యక్తిగతంగా కూడా పలు రాష్ట్ర, జాతీయ అవార్డులను అందుకున్నారు. ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ తో పాటు అనేక జీవితకాల సాఫల్య పురస్కారాలు పొందారు.

నిర్మాతగా ఎన్నో విజయవంతమైన ఆయన కేరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. శ్రీనివాసన్ నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆధునిక మలయాళ సినిమాకు కీలక సేవలు అందించారు. ఆయన తరతరాల నటులు, దర్శకులను ప్రభావితం చేశారు. జాతీయ, కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, అందుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+