ఆ మలయాళ మూవీ కోసం ఏడాది పొడవునా తెగ సెర్చ్ చేశారు..!!

ఈ ఏడాది గూగుల్ జాబితాలో బాలీవుడ్ చిత్రాలు ఆధిపత్యం చెలాయించాయి. సైయారా మొదటి స్థానంలో నిలిచింది. కాంతారా, కూలీ.. రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. టాప్ 10లోవార్ 2, సనమ్ తేరీ కసం, హౌస్‌ఫుల్ 5, గేమ్ చేంజర్, మిసెస్, మహావతార్ నరసింహ వంటి సినిమాలు ఉన్నాయి. ఇంత తీవ్ర తీవ్ర పోటీ మధ్య కూడా ఓ మలయాళ సినిమా ఆరో స్థానంలో ఉండటం.. అందరినీ ఆకర్షించింది. ఆ సినిమానే.. మార్కో. 2024 డిసెంబర్ లో విడుదల కావడం వల్ల ఈ ఏడాది మోస్ట్ సెర్చింగ్ ఫిల్మ్ కేటగిరీలో చేరింది.

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ ఇది. హనీఫ్ అడెని దర్శకత్వం వహించారు. రచయిత కూడా అతనే. ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం మార్కో.. మరో అద్భుత ఘనతను సాధించింది. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఇటీవల విడుదల చేసిన అత్యధికంగా సెర్చ్ చేసిన చిత్రాల జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక మలయాళ చిత్రంగా నిలిచింది.

Marco A Malayalam Action Thriller Starring Unni Mukundan The Most Googled Movie of 2025

మార్కో అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందింది. దక్షిణ కొరియాలో జరిగిన ప్రతిష్టాత్మక బ్యూచియోన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ (BIFAN)లో దీని అంతర్జాతీయ ప్రీమియర్ జరిగింది. SIIMA అవార్డులలో క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన షరీఫ్ ముహమ్మద్ ఉత్తమ డెబ్యూ నిర్మాత అవార్డును అందుకున్నారు. ఈ చిత్రం 100 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకొంది. 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది.

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా విశేష ఆదరణ పొందింది. మలయాళంతో పాటు ఇతర భాషల్లో థియేట్రికల్ విజయవంతం అయిన తర్వాత సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అయింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో కూడా థియేటర్లలో విడుదలై అద్భుతమైన స్పందన లభించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మార్కో చిత్రానికి "ఏ" సర్టిఫికేట్‌ను అందించింది. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ కలై కింగ్‌స్టన్ సమకూర్చిన తీవ్రమైన హింసాత్మక, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యానిమల్, కిల్ వంటి బాలీవుడ్ చిత్రాల మాదిరిగానే, ఈ సినిమాలోని హై-ఆక్టేన్ హింసాత్మక సన్నివేశాలు ఇందులో ఉన్నాయి.

ఉన్ని ముకుందన్ ఈ చిత్రంలో తన కెరీర్‌లో అత్యుత్తమమైన నటనను ప్రదర్శించారు. అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఉత్సాహభరితమైన స్పందన లభించింది. దర్శకుడు హనీఫ్ అడెని, నిర్మాత షరీఫ్ ముహమ్మద్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ చిత్రాన్ని రూపొందించారు, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. రగ్గడ్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో ఉన్ని ముకుందన్, జగదీష్‌తో కలిసి నటించిన సన్నివేశాలు సినిమాకు మరిచిపోలేని క్షణాలను అందించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+