మెగాస్టార్ చిరంజీవి "మన శంకర వరప్రసాద్ గారు" సెన్సార్ రివ్యూ..!

మెగాస్టార్ చిరంజీవి - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం "మన శంకర వరప్రసాద్ గారు". చిరు కెరీర్‌లో 157వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరీలియో సంగీతం సమకూరుస్తున్నారు. అలానే లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. కేథరిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటివరకు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించాయి. ఆయన తెరకెక్కించిన చివరి చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేష్ హీరోగా వచ్చిన ఆ మూవీ భారీ హిట్ అందుకుంది. ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. దాంతో మళ్లీ వీరి కాంబినేషన్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ (CBFC) రివ్యూ వెల్లడించింది. మరీ ఈ మూవీకి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది ? రన్‌టైమ్ ఎంత? మూవీ ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా...

megastar-chiranjeevi-mana-shankara-varaprasad-garu-review-by-censor-board

మూవీ ఎలా ఉందంటే..?

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమోలు, పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. వింటేజ్ చిరంజీవిని మళ్లీ చూస్తారంటూ చెబుతున్న అనిల్.. మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన ఫన్, మాస్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిపి పక్కా ఎంటర్ టైనర్ లాగా ప్రేక్షకుల ముందుకు ఈ మూవీని తీసుకురాబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతటి భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని సెన్సార్ అధికారులు వీక్షించారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ పర్ఫామెన్స్.. చిరు - నయనతార కెమిస్ట్రీ, కామెడీ సీన్స్, వెంకీ అతిథి పాత్ర.. ఇలా అన్నీ కలిపి మెగాతో పాటు విక్టరీ ఫ్యాన్స్‌కి కూడా ఫుల్ ఖుషి ఇవ్వడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపిస్తుందని సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తోంది.

కాగా ఈ సినిమాలో అభ్యంతరాలు వ్యక్తం చేసేంత సన్నివేశాలు లేకపోవడంతో అంతా సజావుగానే జరిగిపోయిందని అంటున్నారు. కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్‌ గురించి సెన్సార్ అధికారులు తమ కన్సర్‌ను తెలియజేయగా.. వాటిని సవరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్టు టాక్ వినిపిస్తుంది. దాంతో ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్‌ను అందించినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. మొత్తంగా అనిల్ రావిపూడి తన సక్సెస్ ఫార్మూలా నమ్ముకొని సక్సెస్ కొట్టేసారని జోరుగా చర్చ నడుస్తోంది.

megastar-chiranjeevi-mana-shankara-varaprasad-garu-review-by-censor-board

రన్ టైమ్..

ఇక ఈ సినిమా ఫుల్ కామెడిగా ఉండనుందని.. నయనతార, వెంకటేష్ లాంటి స్టార్ కాస్ట్ కూడా ఉండటంతో స్క్రీన్ స్పేస్ కూడా పెరిగిందని తెలుస్తోంది. ఈ సినిమాన ఫైనల్‌గా 2 గంటల 42 నిమిషాల నిడివితో అంటే 162 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచిన్నట్టు చెబుతున్నారు.

యూఏ సర్టిఫికెట్..

మన శంకర వరప్రసాద్ సినిమా అన్ని కోణాల్లో సమీక్షించిన తర్వాత ఈ చిత్రానికి యూఏ (UA16+) సర్టిఫికెట్ జారీ చేశారు. దాంతో ఈ సినిమాను 16 ఏళ్ల నిండిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల అనుమతి, పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుందనే నిబంధనను సెన్సార్ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+