బిగ్‌బాస్ 9 గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ఫిక్స్.. టీఆర్పీ రికార్డ్స్ ఊచకోత పక్కా !!

ప్రముఖ రియాలిటీ షో "బిగ్‌బాస్" చివరి అంఖానికి చేరుకుంది. వరుసగా ఎనిమిది సీజన్ల విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. 9వ సీజన్‌ కూడా ప్రేక్షకులకు వినోదాలను పంచింది. గత సీజన్ లతో పోలిస్తే ఈసారి టీఆర్పీ పరంగా, కంటెంట్ పరంగా కూడా మంచి విజయాన్ని సాధించింది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అంటూ కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీజన్ దాదాపు 15 వారాల పాటు ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకులకు బాగా అలరించింది.

అయితే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచి తనూజ, లేదా ఇమ్మానుయేల్ విన్నర్ అవుతారని అందరూ భావించారు. అయితే కామన్ మాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్ కూడా మధ్యలో అమ్మాయిల విషయంలో కొంచెం ట్రోలింగ్ ఎదుర్కొన్న కానీ మళ్లీ టాస్కులలో, బిహేవియర్ తో మళ్లీ గట్టిగానే కం బ్యాక్ ఇచ్చారు. టాప్ 5 నుంచి సంజన ఎలిమినేషన్ అనుకున్నదే కానీ.. కానీ ఎవరూ ఊహించని విధంగా ఇమ్మానుయేల్ కూడా బయటికి రావడం అందరికీ బిగ్ షాక్ ఇస్తుంది.

megastar-chiranjeevi-or-prabhas-may-grace-the-bigg-boss-9-telugu-grand-finale

కాగా టైటిల్ విజేతగా టాప్ 3 ప్లేసుల్లో పవన్, తనూజ, ఇమ్మూ మధ్య గట్టి పోటీ ఉందని చెబుతున్నారు. మరి వీరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు.. కప్ గెలిచేది ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.ఈరోజు రాత్రి ( డిసెంబర్ 21వ తేదీ , ఆదివారం ) రాత్రి 7 గంటల నుంచి జరగనున్న ఈ గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫినాలే దగ్గరపడుతున్న కొద్దీ టైటిల్ విన్నర్ ఎవరు అన్నదే కాదు.. గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరు? అన్న అంశంపై కూడా సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

అయితే గత సీజన్లను పరిశీలిస్తే.. బిగ్ బాస్ ఫినాలేకు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా వచ్చి షోకు మరింత గ్లామర్ తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మొదటి సీజన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా.. శివ బాలాజీకి ఆయనే ట్రోఫీ అందజేశారు. రెండో సీజన్‌లో నాని హోస్ట్‌గా చేయగా.. వెంకటేష్ చీఫ్ గెస్ట్‌గా హాజరై కౌశల్‌కు ట్రోఫీ అందించారు. ఇక మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ బాధ్యతలు చేపట్టగా.. మెగాస్టార్ చిరంజీవి పలుమార్లు ఫినాలేకు గెస్ట్‌గా వచ్చి విజేతలను ప్రకటించారు. సీజన్ 8లో అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై విన్నర్ నిఖిల్‌కు ట్రోఫీ అందించారు.

దీంతో ఈసారి సీజన్ 9 ఫినాలేకు కూడా మరోసారి చిరంజీవి వస్తారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో ఆ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ వేదికపై చిరంజీవి సందడి చేసే అవకాశం ఉందని టాక్. కానీ మరోవైపు ఫినాలే గెస్ట్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ప్రభాస్ నటిస్తున్న 'రాజా సాబ్'సినిమా జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ బిగ్ బాస్ వేదికపై కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి ఇప్పటికే ఈ సీజన్ టాప్ టీఆర్పీ లను నమోదు చేయగా.. ప్రభాస్ ఎంట్రీ ఇస్తే రికార్డులు బద్దలవ్వడం గ్యారంటీ అని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+