Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డికాప్రియోకు బిగ్ షాక్- ఉత్తమ నటుడి అవార్డ్ తన్నుకు పోయిన స్టార్ హీరో

Oscar Awards 2026: హాలీవుడ్‌లో బిగ్గెస్ట్ వేడుక.. ఆస్కార్ అవార్డుల సందడి గ్రాండ్‌గా ఆరంభమైంది. ఇది 98వ ఎడిషన్. భారత కాలమాన ప్రకారం ఈ తెల్లవారు జామున సరిగ్గా 5:30 గంటలకు ఈ ప్రదానోత్సవం ప్రారంభమైంది. అమెరికా కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్ దీనికి వేదిక. అమెరికాకు చెందిన ప్రముఖ కమేడియన్, రైటర్, టెలివిజన్ హోస్ట్ కానన్ ఓబ్రియాన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించారు. తన దైన శైలిలో నవ్వులు పూయించారు. కానన్.. ఆస్కార్ కు కామెంటేటర్ గా వ్యవహరించడం వరుసగా ఇది రెండోసారి.

భారత్ కు చెందిన హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈ కార్యక్రమంలో మెరిశారు. భర్త జొనాస్ తో కలిసి సందడి చేశారు. ఈ ఏడాది అవార్డులను అందించే వారిలో ఉన్నారామె. ఈ ఆస్కార్ రేసులో ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన సినర్స్ 16 నామినేషన్లతో రికార్డు సృష్టించింది. పాల్ థామస్ అండర్సన్ రూపొందించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 13 నామినేషన్లతో గట్టిపోటీ ఇస్తోంది. ఈ రెండు చిత్రాలు ఈసారి అవార్డుల సీజన్‌లో ప్రధానంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Michael B Jordan and Jessie Buckley Take Home Best Actor and Best Actress of Oscars 2026 Celebrate

స్టార్ హీరో మైఖేల్ బీ జోర్డాన్.. ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్నాడు. సిన్నర్స్ లో ది బెస్ట్ అనిపించుకున్నాడీ యాక్టర్. మిస్సిసిప్పి బ్యాక్ గ్రౌండ్ తెరకెక్కిన సూపర్ నేచురల్ మూవీ సిన్నర్స్. ఇందులో స్మోక్, స్టాక్ అనే క్యారెక్టర్లను పోషించాడు. అతని అద్భుత నటనకు ఏకంగా ఆస్కార్ కొట్టేశాడు. ఉత్తమ నటుడి ఆస్కార్ అందుకున్న ఆరో నల్లజాతి నటుడు.. జోర్డాన్. 1963లో సిడ్నీ పోయిటియర్, డెంజెల్ వాషింగ్టన్, జామీ ఫాక్స్, ఫారెస్ట్ విటేకర్, విల్ స్మిత్.. ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు.

ఈ కేటగిరీలో టీమోథీ చలమెట్- మార్టీ సుప్రీం, లియోనార్డో డికాప్రియో- వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, ఈథన్ హాక్- బ్లూ మూన్, వాగ్నర్ మౌరా, ది సీక్రెట్ ఏజెంట్ పోటీ పడ్డారు. వారికెవరికీ ఈ అవార్డు దక్కలేదు. గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల తర్వాత చలమెట్ తొలి ఫేవరెట్ కాగా, యాక్టర్ అవార్డ్స్‌లో జోర్డాన్ విజయం ఆస్కార్ ఓటింగ్‌లో ఆయనకు ఊపునిచ్చింది.

ఉత్తమ సహాయ నటి: అమీ మాడిగన్- వెపన్స, యానిమేటెడ్ ఫీచర్: కె-పాప్ డెమోన్ హంటర్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హూ క్రైడ్ పెర్ల్స్, కాస్ట్యూమ్ డిజైన్: కేట్ హ్యాలీ- ఫ్రాంకెన్‌స్టీన్, మేకప్ అండ్ హెయిర్‌ స్టెయిలింగ్: మైక్ హిల్, జోర్డాన్ శామ్యూల్, క్లియోనా ఫ్యూరీ ఫ్రాంకెన్‌స్టీన్, కాస్టింగ్ డైరెక్టర్: కాసండ్రా కులుకుండిస్- వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్ ఎక్స్ఛేంజింగ్ సలైవా. ఈ కేటగిరీలో ఈ రెండూ ఈ అవార్డుకు అందుకున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+