టాలీవుడ్‌లోకి "మిస్ యూనివర్స్ ఇండియా" గ్రాండ్ ఎంట్రీ.. కానీ !
అందాల ప్రపంచంలో తమదైన గుర్తింపు సంపాదించిన ఎందరో బ్యూటీలు.. సినిమాల్లోకి కూడా అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా.. ఇలా ఎందరో ఎంట్రీ ఇచ్చి తమదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే జాబితాలోకి మరో బ్యూటీ కూడా చేరబోతుంది. ఆమె ఎవరో కాదు.. రియా సింఘా (Rhea Singha). తెలుగు సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ భామ.
మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా..
గుజరాత్‌కు చెందిన రియా సింఘా కేవలం 18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటం దక్కించుకుంది. అంతకు ముందు మిస్ టీన్ గుజరాత్, మిస్ టీన్ ఎర్త్ 2023 వంటి ప్రతిష్టాత్మక టైటిళ్లను గెలుచుకుంది. అలానే అంతర్జాతీయ స్థాయిలో కూడా రియా మెరిసింది. మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ 2024 పోటీలో టాప్-30 సెమీ ఫైనలిస్ట్గా నిలిచి భారతీయులకు గర్వకారణంగా మారింది. ఇన్నాళ్లు అందాల పోటీల్లో సత్తా చాటిన ఈ యువతీ ఇప్పుడు టాలీవుడ్ లో నటనా ప్రయాణాన్ని ప్రారంభించబోతుంది.

'జెట్లీ' చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం..
కాగా టాలీవుడ్‌లో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తుతున్నాడు కమెడియన్ సత్య. ఇప్పుడు ఈయన హీరోగా రూట్ మార్చాడు. మత్తు వదలరా సినిమాలో "యేసు దాసు" పాత్ర అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ సినిమాలో హీరోకంటే ఎక్కువ ప్రశంసలు అందుకున్నాడు. దాంతో మత్తు వదలరా 2 సమయంలో దర్శకుడు రితేష్ రానా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ఇప్పుడు సత్యను హీరోగా చేస్తూ "జెట్లీ" అనే మూవీ అనౌన్స్ చేశాడు.
అయితే రియా పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమె పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఈ పిక్ చూస్తేనే ఆమె పాత్ర యాక్షన్‌కు ప్రాధాన్యమున్నట్టు కనిపిస్తుంది. ఇందులో రియా "శివానీ రాయ్"గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ అనౌన్స్ మెంట్ తో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ అందాలు భామ ఎవరైనా స్టార్ హీరో సరసన నటిస్తే బాగుండేదని కానీ కమెడియన్ పక్కన నటించడం ఏంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Miss Universe India in a Universal Telugu cinema 👸❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) December 10, 2025
Introducing #RheaSingha, landing from the world of #JETLEE ✈️
Wishing the Amazing and Gorgeous Rhea a very Happy Birthday 🥳
A @RiteshRana's turbulence 🛫
Starring #Satya, #RheaSingha, @vennelakishore
Produced by… pic.twitter.com/1h0pYj6I6T












Click it and Unblock the Notifications