నాగ చైతన్య నెవర్ బిఫోర్ అవతార్.. కేరీర్ బిగ్టెస్ట్ హిట్ ప్రామిస్
అక్కినేని నాగ చైతన్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ.. వృషకర్మ. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. తండేల్ తర్వాత నాగ చైతన్య నటిస్తోన్న అడ్వెంచర్ బేస్డ్ మూవీ కావడం వల్ల దీనిపై హైప్ క్రియేట్ అయింది. ఇది చైతూ నటిస్తోన్న 24 మూవీ కూడా. గత ఏడాది చైతూ బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ టైటిల్, ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు.
ఇప్పుడు తాజాగా ఈ చిత్రం గ్లింప్సెస్ విడుదల అయింది. కార్తీక్ దండు తన సినిమాలకు 'వి/వ' అక్షరంతో ప్రారంభమయ్యే టైటిల్స్‌ను పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ఇదివరకు దర్శకత్వం వహించిన విరూపాక్ష హిట్ కావడంతో అదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తోన్నాడు. సంస్కృత పదాలను ఎంచుకున్నాడు. ఈ గ్లింప్సెస్ లో నాగ చైతన్య పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించాడు. సిక్స్ ప్యాక్ బాడీ, స్టైలిష్ హెయిర్‌డో, కండలు తిరిగిన శరీరంతో ఈ క్యారెక్టర్ కు తగ్గట్టుగా అగ్రెసివ్ గెటప్ లో దర్శనం ఇచ్చాడు.

ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తండేల్ మూవీ తర్వాత నాగచైతన్య నటిస్తోన్న తాజాగా సినిమా ఇదే. తండేల్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మత్స్యకారుడిగా నాగచైతన్య డిఫరెంట్ రోల్ లో ట్రై చేసినప్పటికీ ఆ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ దఫా అడ్వెంచర్ థ్రిల్లర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు అతను నటించని జానర్ ఇది.
A MYTHICAL THRILLER LIKE NEVER BEFORE ❤️🔥
— SVCC (@SVCCofficial) March 5, 2026
Enter the world of #Vrushakarma.
#VrushakarmaGlimpse OUT NOW 💥
— https://t.co/YrwVeyuFqC
Yuvasamrat @chay_akkineni in @karthikdandu86's vision 🔥@Meenakshiioffl @BvsnP @aryasukku #SparshShrivastava @AJANEESHB #RagulDHerian… pic.twitter.com/MX2159R6od
కార్తీక్ దండు దర్శకత్వంలో నటించడం ఇదే మొదటిసారి. ఓ పౌరాణిక హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నాడు. చీకటి శక్తులు ఆవహించిన విలన్ ఒక రహస్యమైన చిత్రాన్ని గీస్తూ కనిపించడంతో గ్లింప్లెస్ మొదలవుతుంది. ఆద్యంతం ఆకట్టుకుంది. గూస్ బంప్స్ తెప్పించింది. సాహసోపేతమైన స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలతో నిండిన పాత్ర కావడం వల్ల దానికి తగ్గట్టుగా కనిపించాడు. విలన్ గా స్పర్శ్ శ్రీవాస్తవ నటిస్తోన్నాడు. అజనీష్ బీ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్.. సినిమాను మరింత గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా మార్చింది.












Click it and Unblock the Notifications