మరో అమ్మాయితో జానీ మాస్టర్..!

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు గురించి తెలిసిన విషయమే. తన దగ్గర పని చేస్తోన్న అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌పై జానీ అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు.

పోలీసులు సైతం అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌పై జానీ అత్యాచారానికి పాల్పడిన సాక్ష్యాలను సేకరించారు. దీంతో ఆయన ఈ కేసు నుంచి బయటపడటం కష్టమే అనుకున్నారంతా. మొత్తానికి ఈ కేసులో బెయిల్ తెచ్చుకున్న జానీ మాస్టర్ తిరిగి పలు సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. రామ్ చరణ్ 'పెద్ది', రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూక' వంటి సినిమాలకు ఆయన పని చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా నుంచి 'చికిరి చికిరి' అంటూ వచ్చిన సాంగ్ పెద్దగా హిట్‌గా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యధిక వ్యూస్ సాధించిన సాంగ్‌గా 'చికిరి' నిలిచింది.

Netizens targeting Jani Master for new reel

ఈ పాటలో రామ్ చరణ్ తనదైన హుక్ స్టెప్పులతో అదరగొట్టారు. తాజాగా ఈ పాటను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ అమ్మాయితో కలిసి రీల్ చేశారు.అయితే ఈ రీల్‌పై నెటిజన్లు తమదైన కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. ఈ పాటలో జాన్వీ కపూర్ కంటే ఈ వీడియోలో ఉన్న అమ్మాయి అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు జానీ మాస్టర్ కంటే రామ్ చరణే అందంగా డ్యాన్స్ వేశారంటూ కితాబిస్తున్నారు.

అయితే కొందరు నెటిజన్లు మాత్రం జానీ మాస్టర్‌ను పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. 'మరో అమ్మాయిని లైన్లో పెట్టిన జానీ మాస్టర్', 'జానీ మాస్టర్ ఇంకో పోలీస్ కేసు కోసం ట్రై చేస్తున్నాడు','మళ్ళీ ఎవరిని కేలకకుండ గమ్ముని ఉండు' అంటూ జానీ మాస్టర్‌ని ఉద్దేశించి కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్ చేసిన ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+