లవర్ ను పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్
మాస్ మహారాజా రవితేజతో కలిసి ఓ సినిమాలో మెరుపులు మెరిపించిన బాలీవుడ్ యాక్ట్రెస్.. పెళ్లి పీటలు ఎక్కారు. తన లవర్ ను పెళ్లాడారు. అతి కొద్దిమంది సమక్షంలో ఈ వివాహ వేడుక ముగిసింది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సెలెబ్రెటీలు పరిమితంగా దీనికి హాజరయ్యారు. పెళ్లి ఫొటోలను తమ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఒకట్రెండు రోజుల్లో ముంబై వేదికగా గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
బాలీవుడ్ నటి నుపుర్ సనన్, సింగర్ స్టెబిన్ బెన్.. చాలాకాలంగా ప్రేమలో ఉంటోన్నారు. ఇప్పుడు అధికారికంగా భార్యాభర్తలు అయ్యారు. నుపుర్.. మరెవరో కాదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలే. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించారామె. దీని తర్వాత టాలీవుడ్ లో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం హిందీలో నూరాని చెహ్రా సినిమాలో నటిస్తోన్నారు.

ఈ వివాహానికి హాజరైన సెలెబ్రిటీల్లో దిశా పటానీ, మౌనీ రాయ్, కబీర్ బాహియా, నిర్మాత దినేష్ విజన్, దర్శకుడు అమర్ కౌశిక్ ఉన్నారు. వారందరూ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. టాప్ ఫ్యాషన్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ కూడా వివాహ వేడుకలకు సంబంధించిన కొన్ని వీడియోలను పోస్ట్ చేశారు. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ఆసిఫ్ అహ్మద్ కూడా ఈ వేడుకల్లో కనిపించారు.
నుపూర్, స్టెబిన్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు రెండు రోజులుగా కొనసాగుతూ వచ్చాయి. పింక్ థీమ్‌తో జరిగిన సంగీత్ వేడుకలో డ్యాన్స్ ఫ్లోర్ పై పలువురు సెలెబ్రిటీలు అదరగొట్టారు. నుపూర్, ఆమె సోదరి కృతి సనన్, ఇతర సన్నిహిత స్నేహితులు డాన్స్ తో స్టేజ్‌ను హోరెత్తించారు. 'దిల్ తూ జాన్ తూ' పాటకు ఉత్సాహంగా స్టెప్పులేశారు. కృతి సనన్, వరుణ్ శర్మ 'లాలీపాప్' పాటకు ఎనర్జిటిక్ స్టెప్ వేశారు. హల్దీ వేడుకలు కూడా అదే రేంజ్ లో సాగాయి. నిర్మాత రాఘవ్ శర్మ, నటుడు వరుణ్ శర్మ సహా పలువురు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications