Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటీటీ రిలీజ్ : ఒక్క వారంలోనే 30కి పైగా సినిమాలు, సిరీస్‌లు !!

ప్రస్తుత కాలంలో వినోద రంగం ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ వైపు చూడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు 'ప్రపంచ సినిమా' మన అరచేతిలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన సినిమాలు కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యక్షమవుతుండటంతో, ఓటీటీ హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. అంతే కాకుండా సినిమా రిలీజ్ అయిన రెండు మూడు వారాల్లోనే ఇంటికే వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే ప్రశాంతంగా సినిమా చూడటానికి మొగ్గు చూపుతున్నారు.

థియేటర్ టికెట్లు, స్నాక్స్ ఖర్చులతో పోలిస్తే, ఒక నెలకు సరిపడా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో కుటుంబమంతా కలిసి ఎన్నిసార్లైనా సినిమా చూసే సౌలభ్యం ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. అలానే హై-క్వాలిటీ సౌండ్ సిస్టమ్స్, స్మార్ట్ టీవీల అందుబాటుతో ఇంటినే మినీ థియేటర్‌గా మార్చుకుంటున్నారు సినీ ప్రియులు. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా హాలీవుడ్, కొరియన్, స్పానిష్ వంటి అంతర్జాతీయ చిత్రాలు, సిరీస్‌లు కూడా తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి రావడంతో ఓటీటీలకు క్రేజ్ పెరిగింది.

ott-releases-on-the-occasion-of-sankranti-in-this-week

సంక్రాంతి స్పెషల్..

ఇక ప్రస్తుతం సంక్రాంతి సీజన్ మొదలైంది. ఒకవైపు థియేటర్లలో అగ్ర హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు ఓటీటీ సంస్థలు కూడా తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఈ వారం ప్రేక్షకులకు 'డబుల్ ధమాకా' ఖాయంగా కనిపిస్తోంది. ప్రముఖ ప్లాట్‌ఫామ్స్ అయిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మరియు ఆహా వంటి సంస్థలు ఈ వారం కొత్త కంటెంట్‌తో సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం ఓటీటీ లోకి వచ్చిన, రాబోయే చిత్రాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా...

అఖండ 2..

నందమూరి నటసింహం బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన ఫాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్‌ "అఖండ2: తాండవం". సంక్రాంతి కానుకగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా తదితరులు నటించారు.

కానిస్టేబుల్‌ కనకం సీజన్ 2..

ఈటీవీ విన్‌ (ETV Win) ఒరిజినల్‌ వెబ్‌సిరీస్‌ "కానిస్టేబుల్‌ కనకం".. ఆగస్టులో విడుదలై, ప్రేక్షకులను విశేషంగా అలరించింది. దానికి కొనసాగింపుగా కానిస్టేబుల్‌ కనకం సీజన్‌2 ప్రస్తుతం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తొలి భాగాన్ని మించిన ట్విస్ట్‌లు అలరిస్తున్నాయి.

జిగ్రీస్‌..

కృష్ణ బూరుగుల, ధీరజ్‌ ఆత్రేయ, మణి వక్కా, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'జిగ్రీస్‌'. హరీశ్‌రెడ్డి ఉప్పుల దర్శకుడు. కృష్ణ వోడపల్లి నిర్మించారు. నవంబరు 14న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్‌..

  • దే దే ప్యార్‌దే 2 (మూవీ) హిందీ
  • ది రూకీ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌
  • హిజ్‌ అండ్‌ హర్స్‌ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌
  • పీపుల్‌ వి మీట్‌ ఆన్‌ వెకేషన్‌ (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు
  • గుడ్‌ నైట్‌, అండ్‌ గుడ్‌ లక్‌: లివ్‌ ఫ్రమ్‌ బోర్డ్‌ వే (మూవీ) ఇంగ్లీష్‌

సోనీ లివ్..

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో చూపించడానికి సిద్ధమైంది 'ఫ్రీడమ్‌ ఎట్‌ మిడ్‌నైట్‌ సీజన్‌ 2' సిరీస్‌. నిఖిల్‌ అడ్వాణీ దర్శకత్వంలో సిద్ధాంత్‌ గుప్తా, చిరాగ్‌ వోరా, రాజేంద్ర చావ్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం సోనీలివ్‌ వేదికగా అందుబాటులోకి వచ్చింది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో..

  • అందెలరవమిది (మూవీ:రెంట్‌) తెలుగు
  • ఎల్లో (మూవీ) తమిళ్‌
  • ప్రెడేటర్‌: బ్యాండ్‌ల్యాండ్స్‌ (మూవీ)ఇంగ్లీష్‌
  • నాట్‌ విత్‌ అవుట్‌ హోప్‌ (మూవీ)ఇంగ్లీష్‌
  • పీటర్‌ హుజార్స్‌ డే (మూవీ)ఇంగ్లీష్‌
  • జోడియాక్‌ కిల్లర్‌ ప్రాజెక్ట్‌ (మూవీ) ఇంగ్లీష్‌

జియో హాట్‌స్టార్‌..

  • హీర్‌ ఎక్స్‌ (మూవీ) హిందీ
  • వెపన్స్‌ (మూవీ) ఇంగ్లీష్‌
  • ఏ థౌజెండ్‌ బ్లోస్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌2) ఇంగ్లీష్‌
  • ట్రాన్‌: ఏరీస్‌ (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు
  • ది టేల్‌ఆఫ్‌ సిలియాన్‌ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

ఆహా..

  • అయలాన్‌ (మూవీ) తెలుగు

2024 సంక్రాంతికి తమిళంలో రిలీజైన శివకార్తీకేయన్ ఫిల్మ్ ఇది. ఇప్పడు లేటస్ట్ గా తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. రెండేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఆహాలో సందడి చేస్తోంది.

ఈటీవీ విన్‌..

  • మళ్లీ వచ్చిన వసంతం (మూవీ) తెలుగు

జీ5..

  • మాస్క్‌ (మూవీ) తమిళ్‌
  • రోన్నీ: ది రూరల్‌ (మూవీ)కన్నడ
  • సింప్లీ సౌత్‌
  • మహాసేన్హా (మూవీ) తమిళ్‌
  • అంగామలై (మూవీ)
  • లీచా (మూవీ) మలయాళం

సన్‌ నెక్ట్స్‌..

  • సైలెంట్‌ స్క్రీమ్స్‌: ది లాస్ట్‌గర్ల్‌ ఆఫ్ తెలంగాణ (మూవీ) తెలుగు
  • రాధేయా (మూవీ)కన్నడ

లయన్స్‌ గేట్‌ప్లే..

  • నాట్‌ ఆల్‌ మూవీస్‌ ఆర్‌ ది సేమ్‌ (మూవీ) తెలుగు

మనోరమా మ్యాక్స్‌..

  • మెమొరీ ప్లస్‌ (మూవీ) మలయాళం
  • కెద్దా (మూవీ) మలయాళం
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+