మాస్ హీరోతో తెలుగు స్టార్ దర్శకుడి పాన్ ఇండియా మూవీ
టాలీవుడ్ స్టార్ దర్శకుడొకరు చాలా కాలం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టారు. డైరెక్టర్ కుర్చీలో కూర్చోనున్నాడు. యాక్షన్, కట్ చెప్పబోతున్నాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి సూపర్ స్టార్లకు కేరీర్ లోనే బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన ఈ దర్శకుడు.. చాలాకాలంగా ఫ్లాప్ లను చవి చూస్తూ వస్తోన్నాడు. దాదాపుగా రెండున్నరేళ్ల విరామం తర్వాత మళ్లీ కొత్త సినిమాను ప్రకటించారు. ఇది పాన్ ఇండియా లెవెల్ మూవీ. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపుదిద్దుకోనుంది.
ఆయనే పూరీ జగన్నాథ్. తన కొత్త సినిమా టైటిల్ ను ఆవిష్కరించారాయన. ఈ మూవీ టైటిల్- స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్. (Slum Dog 33 Temple Road). విజయ్ సేతుపతి హీరో. పూరీ కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్షర్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నాయి. పూరీ జగన్నాథ్ తో కలిసి ఒకప్పటి స్టార్ హీరోయిన ఛార్మీ, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల.. ఈ మూవీని నిర్మిస్తోన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్.. మ్యూజిక్ ను కంపోజ్ చేస్తోన్నారు.

ఈ మూవీ టైటిల్, విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది చిత్రం యూనిట్. మాసిపోయిన దుస్తులు, చేతిలో రక్తమోడుతున్న మొద్దు కత్తితో కనిపించాడు విజయ్ సేతుపతి. నేడు సేతుపతి బర్త్ డే. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ రివిల్ చేశారు. తనకు బాగా అచ్చొచ్చిన ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నట్టే కనిపిస్తోందీ ఫస్ట్ లుక్ చూస్తోంటే. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ తో పూరీ జగన్నాథ్ గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో బిజినెస్ మేన్ తీసి సూపర్ హిట్ కొట్టారు. ఇది ఆయనకు ఇష్టమైన జానర్.
From the slums…
— Puri Connects (@PuriConnects) January 16, 2026
rises a storm no one can stop.
RAW. RUTHLESS. REAL. ❤️🔥❤️🔥❤️🔥#PuriSethupathi is #SLUMDOG - 33 Temple Road 💥💥💥
Happy Birthday Makkalselvan @VijaySethuOffl ❤️#HBDVijaySethupathi
A #PuriJagannadh film 🎬@Charmmeofficial Presents 🎥
Produced by Puri… pic.twitter.com/ca2PCs6tBG
ఈ మూవీతోనైనా తన పూర్వవైభవాన్ని అందుకోవాలని చూస్తోన్నాడు పూరీ జగన్నాథ్. అప్పుడెప్పుడో టెంపర్, చాలా గ్యాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టారు. జ్యోతిలక్ష్మి, రోగ్, ఇజం, పైసా వసూల్, మెహబూబా, లైగర్ వంటి సినిమాలు ఎప్పుడొచ్చాయో కూడా తెలియనంత ఫ్లాప్ అయ్యాయి. డబుల్ ఇస్మార్ట్ ఫర్వాలేదనిపించుకుంది. దీని తర్వాత పూరీ నుంచి రాబోతోన్న నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే కావడంతో హైప్ క్రియేట్ చేస్తోంది.
{embed-poll}












Click it and Unblock the Notifications