"పూరీ" కొత్త మూవీ టైటిల్ రివీల్.. ఈ సినిమాతో అయినా గట్టెక్కేనా ???
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. కేవలం డైరెక్టర్ గానే కాకుండా రచయితగా, నిర్మాతగా టాలీవుడ్ లో ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పూరి రాసే పవర్‌ఫుల్ డైలాగ్స్, మాస్ అప్పీల్ లో హీరోలను చూపించే విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అందరూ అంటుంటారు. అయితే ఇటీవల లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలలో ప్లాప్స్ అందుకున్నారు. అందుకే కొంచెం గ్యాప్ తీసుకున్న ఈ మాస్ డైరెక్టర్ గత సినిమాలకు భిన్నంగా కొత్త జోనర్‌లో మూవీ చేస్తున్నారు.
ప్రస్తుతం కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతితో.. ఆయన ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంత కాలం ఈ సినిమాకు "బెగ్గర్" అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ నడిచింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఇప్పుడు ఈ మూవీకి కొత్త టైటిల్ అనౌన్స్ చేసింది మూవీ యూనిట్.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రానికి "స్లమ్ డాగ్" అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రకటించారు. 33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అలానే ఫస్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో విజయ్ సేతుపతి డిఫరెంట్ లుక్‌లో అదరగొట్టారు. బిచ్చగాడి వస్త్రధారణలో కళ్లజోడు పెట్టుకొని, చేతిలో రక్తంతో తడిచిన కత్తి పట్టుకొని పవర్‌ఫుల్‌గా కనిపించారు. బ్యాగ్రౌండ్ లో చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బు కట్టలను చూడొచ్చు. పోస్టర్ ఆసక్తిగా ఉండడంతో ఈ మూవీతో పూరీ గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు భావిస్తున్నారు.
ఇక మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఉప్పెన, సైరా సినిమాల్లో నటనతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు విజయ్. ఇక దళపతి విజయ్ హీరోగా వచ్చిన " మాస్టర్ " సినిమాలో తన విలనిజంతో అందర్నీ ఆకట్టుకున్నాడు. రీసెంట్ గానే మహారాజా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని దక్కించుకుంది.
From the slums…
— Puri Connects (@PuriConnects) January 16, 2026
rises a storm no one can stop.
RAW. RUTHLESS. REAL. ❤️🔥❤️🔥❤️🔥#PuriSethupathi is #SLUMDOG - 33 Temple Road 💥💥💥
Happy Birthday Makkalselvan @VijaySethuOffl ❤️#HBDVijaySethupathi
A #PuriJagannadh film 🎬@Charmmeofficial Presents 🎥
Produced by Puri… pic.twitter.com/ca2PCs6tBG
-
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !!












Click it and Unblock the Notifications