‘పుష్ప2’, ‘ధురంధర్’ సినిమాల్లో అసలైన ఇండస్ట్రీ హిట్ ఏది?
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దాదాపు రూ.1800 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి, మనదేశంలో అతి పెద్ద హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచించి. మరోవైపు ఇటీవలే రణ్ వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా కూడా అతి పెద్ద సంచలనాన్ని నమోదు చేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా కేవలం ఒక్క హిందీలో మాత్రమే విడుదలైంది. నిర్మాత, దర్శకుడు కూడా కేవలం హిందీలోనే సినిమా రిలీజ్ కు మొగ్గుచూపారు. పాన్ ఇండియా లెవల్లో ఇతర భాషల్లో వద్దన్నారు. అయినా ఒక్క హిందీ భాషలోనే ధురంధర్ దాదాపు రూ.1400 కోట్లు రాబట్టింది.
వెయ్యి కోట్లను అత్యంత వేగంగా అందుకున్న పుష్ప2
వసూళ్ల పరంగా చూస్తే, 'పుష్ప 2' గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్ల మార్కును అత్యంత వేగంగా దాటిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్‌లో ఈ సినిమా సృష్టించిన సంచలనం, బాలీవుడ్ అగ్ర హీరోల రికార్డులను సైతం తుడిచిపెట్టేసింది. భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరోవైపు రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురందర్' చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రణవీర్‌కు మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. దేశభక్తి, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఉన్న ఈ సినిమా హిందీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వసూళ్లు హిందీ బెల్ట్ కే పరిమితమయ్యాయి. సౌత్ ఇండియాలో మరియు గ్లోబల్ మార్కెట్‌లో ఈ సినిమాకు లభించిన ఆదరణ 'పుష్ప 2'తో పోలిస్తే తక్కువగాఉంది.

ఈసారి పాన్ ఇండియా సినిమాగా ధురంధర్2
నిజమైన 'ఇండస్ట్రీ హిట్' అనే పదానికి అర్థం అంతకుముందు ఉన్న అన్ని రికార్డులను తిరగరాయడం అని చెప్పొచ్చు. ఆ కోణంలో చూస్తే 'పుష్ప 2' అసలైన ఇండస్ట్రీ హిట్ అని చెప్పవచ్చు. 'పుష్ప 2' సాధించిన వసూళ్లు, అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చిన కలెక్షన్లు 'ధురందర్' కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయి. 'ధురందర్' హిందీ చిత్ర పరిశ్రమకు పెద్ద ఊరటనిచ్చిన హిట్ అయినప్పటికీ, 'పుష్ప 2' రికార్డులను దాటలేకపోయింది.
అయితే తెలుగు, తమిళం, కన్నడం, మళయాళంలో ధురంధర్ విడుదల కాలేదు. ఈ భాషల్లో కూడా విడుదలైతే చాలా సులువుగా మరో రూ.400 కోట్లు వచ్చేవని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ధురంధర్ 2ను ఈసారి అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. ఒకవేళ సినిమా బాగుందనే మౌత్ టాక్ వస్తే కచ్చితంగా రూ.2వేల కోట్లు రాబట్టే అవకాశం ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications