రాజాసాబ్ లో మైండ్ బ్లోయింగ్ సీన్లు యాడ్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ.. రాజా సాబ్. మారుతి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఫాంటసీ హారర్ కామెడీ మూవీ.. ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, జరీనా వహాబ్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.
తప్పిపోయిన తాతయ్యను వెతుకుతున్న హీరో.. ఓ భవంతిలో చిక్కుకోవడం దీని ప్రధాన కథాంశం. దీని చుట్టూనే కథను అల్లుకున్నారు మారుతి. దీన్ని తనదైన శైలిలో తెరకెక్కించారు. ఈ సంక్రాంతి సీజన్ లో విడుదలైన మొట్టమొదటి మూవీ ఇదే. ప్రభాస్ అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోతోంది. సలార్, కల్కి వంటి సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ లల్లో నటించిన ప్రభాస్ ను ఈ హారర్ కామెడీ జానర్ లో చూడటం కొంత ప్రతికూలంగా మారింది.

తాజాగా ఈ సినిమాపై రాజా సాబ్ యూనిట్ ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇందులో దర్శకుడు మారుతి, హీరోయిన్లు, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారుతి.. ప్రభాస్ ఫ్యాన్స్ కు అద్దిరిపోయే సమాచారాన్ని ఇచ్చారు. ఈ నెల 12 అంటే సోమవారం నుంచి రాజా సాబ్ సినిమా టికెట్లు తగ్గనున్నాయని తెలిపారు. సాధారణ రేట్లకే టికెట్లు అమ్ముతారని చెప్పారు. ఈ ఫాంటసీ మూవీని సాధారణ టికెట్ రేట్లకే ఎంజాయ్ చేయాలని అన్నారు.
దీంతో పాటు మరో శుభవార్త కూడా ఇచ్చారు నిర్మాత. నేటి నుంచే రాజా సాబ్ సినిమాలో కొన్ని సీన్లను యాడ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రభాస్ నటించిన ఎనిమిది నిమిషాల సీన్లను జత చేస్తామని అన్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు పడే ఫస్ట్ షోకు ఇవి యాడ్ అవుతాయని అన్నారు. విడుదలకు ముందు కొన్ని కరెక్షన్స్ చేయాల్సి రావడం, సర్వర్ డౌన్ కావడం వల్ల ఒరిజినల్ అవుట్ పుట్ నుండి వాటిని తొలగించామని వివరించారు. ఇప్పుడు ఆ సీన్లను థియేటర్లన్నింటికీ పంపించామని చెప్పారు.
ఈ సీన్లల్లో వింటేజ్ ప్రభాస్ ను చూడొచ్చని మారుతి తెలిపారు. అలాంటి సీన్లు లేకపోవడం వల్ల అభిమానులు తనతో మాట్లాడారని, వాటిని యాడ్ చేయాలని కోరారని అన్నారు. దీంతో ఎనిమిది నిమిషాల పాటు ఉండే ఈ సీన్లను యాడ్ చేసినట్లు చెప్పారు. దీనికోసం సినిమా లెంగ్త్ పెరగకుండా ఉండటానికి సెకెండ్ హాఫ్ ను కొంత ట్రిమ్ చేశామని అన్నారు. ఇవి మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్లని, రూఫ్ ఫైట్, దానికి లీడ్ చేసే సీన్లని తెలిపారు. ఫస్ట్ డే సినిమా రిజల్ట్ డిసైడ్ చేయలేమని, ఓ 10 రోజులు ఆగాలని చెప్పారు.












Click it and Unblock the Notifications