ఉస్తాద్ విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!

పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమా.. ఉస్తాద్ భగత్ సింగ్. హైఓల్టేజ్ యాక్షన్‌ మూవీ ఇది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. హరీష్ శంకర్ దర్శకుడు. మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. శ్రీలీల హీరోయిన్. అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. తమిళంలో విజయ్ నటించిన థేరి సినిమాకు రీమేక్ ఇది. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

2012లో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ కూడా వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమానే కావడం వల్ల దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించిందా మూవీ. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సైతం అదే స్టైల్‌లో ఉంటుందని సంబరపడుతున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు పవన్ కల్యాణ్ రగ్డ్ లుక్స్‌లో కనిపిస్తోండటం మరింత హైప్‌ను ఇచ్చినట్టయింది. ఈ మూవీ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న అభిమానులకు పండగలాంటి వార్త అందింది.

Ready to Battle Ustaad Bhagat Singh on March 19 at Box Office Showdown on the Eve of Eid and Ugadi

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ నెల 19వ తేదీన విడుదల కాబోతోంది.. ప్రపంచవ్యాప్తంగా. అదే రోజు ధురంధర్ 2 కూడా రిలీజ్ అవుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్ కు తెర తీసింది. రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2: ది రివెంజ్. గత ఏడాది రికార్డు కలెక్షన్లు సాధించిన ధురంధర్ కు సీక్వెల్. ఈ చిత్రం రూపంలో ఉస్తాద్ భగత్ సింగ్ కు భారీ పోటీ ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది.

మార్చి 26న విడుదల కావాల్సి ఉంది ఉస్తాద్. యష్ టాక్సిక్ జూన్ 4వ తేదీకి వాయిదా పడటంతో ఇది ప్రీపోన్ అయింది. ఏకంగా ధురంధర్ 2తో డైరెక్ట్ ఫైట్ కు దిగింది. ఇది దేశవ్యాప్తంగా- ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ పోరుకు దారితీసింది. పవన్ కళ్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఆయన సినిమా ఎంత బాగాలేదనుకున్నా గానీ బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారంటీ అనిపించుకుంటుంది.

ధురంధర్ పార్ట్ 1తో రెండు తెలుగు రాష్ట్రాలకు చిరపరిచితం అయ్యాడు రణ్ వీర్ సింగ్. ఏపీ, తెలంగాణల్లో డైరెక్ట్ మూవీకి ధీటుగా కలెక్షన్లను రాబట్టుకుంది. ఇది హిట్ కావడంతో ధురంధర్ 2పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇది కాస్తా ఉస్తాద్ భగత్ సింగ్ కు గట్టి పోటీ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. టికెట్ రేట్లు కూడా ప్రభావితం చేయవచ్చని, ధరలు అధికంగా ఉంటే తటస్థ ప్రేక్షకులు ధురంధర్ 2 కి మొగ్గు చూపుతారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+