"సమంత" అదరహో.. అప్పుడు ఆ సీన్‌కి ట్రోల్స్.. ఇప్పుడు విజిల్స్ !!
స్టార్ హీరోయిన్, కుందనపు బొమ్మ " సమంత " అటు సినిమాలు.. ఇటు వెకేషన్ అటూ ఎంజాయ్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ కంటే కూడా పర్సనల్ లైఫ్ విషయాలతోనే సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆమె అనారోగ్యం కారణంగా సినిమాలకు కొంచెం గ్యాప్ ఇవ్వడం.. తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇక రీసెంట్ గానే నాగ చైతన్య మళ్లీ వివాహం చేసుకోగా.. సామ్ కూడా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమోరును పెళ్లి చేసుకున్నారు.
కాగా అంతకు ముందు రాజ్- డీకే దర్శకత్వంలో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2', 'సిటడెల్: హనీ బన్నీ'లో సమంత నటించారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో సామ్ నటనకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా ట్రోల్స్ కూడా భారీగానే వచ్చాయి. రొమాంటిక్ సీన్స్ విషయంలో గట్టిగా విమర్శలు రాగా.. ఆ కారణం గానే నాగ చైతన్యతో విడాకులకు దారి తీశాయని అంటూ నెట్టింట జోరుగా చర్చ నడిచింది. ముఖ్యంగా బస్ సీన్, బెడ్ రూమ్ సీన్స్ లలో ఇప్పటికీ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలి అని నిరూపించారు సమంత. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

కాగా లేడి డైరెక్టర్ నంది రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తున్న లేటెస్ట్ మూవీ "మా ఇంటి బంగారం". త్రలాల మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి సమంత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కాంతారా' ఫేమ్ గుల్షన్ దేవయ్య, కన్నడ నటుడు దిగంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోశ్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ ట్రైలర్ విడుదలైంది. నందిని రెడ్డి - సమంత కాంబోలో వచ్చిన బేబీ సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ కి ఏ మాత్రం మించకుండా అదరగొట్టింది సామ్.
ఈ టీజర్‌లో సమంత మునుపెన్నడూ చూడని రగ్డ్, సీరియస్ లుక్‌తో, చీరకట్టులో బస్సులో ఫైట్ చేస్తున్న సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, క్యారెక్టర్ల ప్రెజెంటేషన్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ఈ సినిమాలో సమంత డూప్ సహాయం లేకుండా సొంతంగా స్టంట్స్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఆ బస్ సీన్ తో ట్రోల్స్ ఎదుర్కొన్న సామ్.. ఇప్పుడు ఈ ఫైట్ సీక్వెన్స్ తో మెప్పించింది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications