అప్పుడు రూ.100 కోట్ల ఆస్తిని తిరుమల వేంకటేశ్వర స్వామికి విరాళం.. కానీ ఇప్పుడు ఇలా !
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలనాటి హీరోయిన్ నటి కాంచన సుపరిచితురాలే. 60,70లో హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఆమె.. మొదట ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం చేసిన ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందారు. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించి ఎన్నో హిట్స్ అందుకున్నారు. ప్రేమనగర్, శ్రీకృష్ణావతార , ఆనంద భైరవి, వంటి సినిమాల్లో నటించారు.
కాగా కాంచన అసలు పేరు వసుంధర. తెలుగు కుటుంబమే అయినప్పటికీ పుట్టింది, పెరిగింది అంతా చెన్నైలోనే. అయితే దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆస్తి బాగానే సంపాదించారు కానీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయారు. వెండితెరపై తన అందం, అభినయంతో ఆకట్టుకున్న కాంచన నిజ జీవితంలో కూడా ఎందరికో ఆదర్శంగా నిలిచేలా సేవ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. విజయ్ దేవరకొండకు నానమ్మగా నటించి మళ్లీ అలరించారు.

అయితే వందల కోట్లు ఆస్తులు సంపాదించిన కాంచన.. చెన్నైలో ఖరీదైన బంగ్లాలో నివసిస్తూ బ్రాండ్ న్యూ కార్లలో ప్రయాణించేవారు. అలాంటి కాంచన ఇప్పుడు అదే చెన్నై రోడ్లపై సాధాసిదా మహిళగా జీవిస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూరు శివారు ప్రాంతంలో నివసిస్తూ చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక గుడిలో ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటూ ఉంటున్నారు. తన ఆస్తిని దానం చేసి ఇప్పుడు సామాన్యూరాలిగా జీవిస్తున్నారు.
వీడియో వైరల్..
కాగా రీసెంట్ గానే ఏవీఎం స్టూడియో అధినేత శరవణన్ మరణించడంతో నివాళి అర్పించేందుకు వచ్చిన ఆమె చాలా సాధారణంగా కనిపించారు. ఆటోలో వచ్చిన ఆమె తిరిగి ఆటోలోనే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీనియర్ నటి సాధారణ వ్యక్తిలా ఆటోలో రావడం ఏంటని చర్చనీయాంశం అవుతోంది. అందుకు కారణం కూడా ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ఒంటరిగి నివసిస్తున్న ఆమె తన ఆస్తులను పేదలకు దానం చేశారు. అలానే కలియుగ దైవం వేంకటేశ్వరుడికి 2010లో రూ.15 కోట్లు విరాళం ఇచ్చారు. ఇప్పుడు వాటి విలువ రూ. 100 కోట్ల పైమాటేనని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ప్రస్తుతం తన చెల్లెలు దగ్గర ఉంటున్నారని వెళ్లడిస్తున్నారు. దేవుడి దయ వల్ల చాలా బాగున్నానని ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను.. -
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
ఆశాభోస్లే - లతా మంగేష్కర్.. అక్క చెల్లెల మధ్య అసలు గొడవేంటి ??? -
లెజెండరీ గాయని "ఆశాభోస్లే" ఎవరి పాటలు వింటారో తెలుసా..? -
ఆశా భోంస్లే 'స్వర' సామ్రాజ్యం.. ఆస్తుల గురించి షాకింగ్ నిజాలు!












Click it and Unblock the Notifications