విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్.. ఎక్కడంటే ???
రౌడీ బాయ్ విజయ దేవరకొండ - స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. సినీ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం వీరి గురించే జోరుగా చర్చ నడుస్తోంది. "గీతగోవిందం" సినిమాలో మొదటిసారి కలిసి నటించిన ఈ జంట భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత "డియర్ కామ్రేడ్" లో మరోసారి కలిసి నటించి మెప్పించారు. అప్పటి నుంచే వీరి మధ్య మంచి స్నేహం ఉందని.. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారి రిలేషన్ లో ఉన్నారని ఓపెన్ గానే డిస్కషన్ నడిచింది.
అంతే కాకుండా ఈ ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా వీరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు. ట్రిప్ లకు, ఫ్యామిలీ గేదరింగ్ సమయంలోనూ వీరు కలిసే ఉండడంతో సీక్రెట్ గా రిలేషన్ లో ఉంటున్నారని అంతా భావించారు. ఒక్కొక్కసారి కలసి మీడియా కంటపడడం కూడా ఈ రూమర్లను నిజం చేశాయి. కానీ ఏ రోజు కూడా ఈ జంట తమ బంధాన్ని ఓపెన్ చేయలేదు. అయితే కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు పెళ్లితో ఒక్కటికాబోతున్నారని చర్చ నడుస్తోంది.

ఇటీవలే వీరిద్దరూ చాలా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని కూడా అంటున్నారు. అయితే ఎంగేజ్మెంట్ ఫోటోలను కూడా ఎక్కడా షేర్ చేయకపోయినా.. నిశితార్థం జరిగిందని మాత్రం సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు. దాంతో వీరి వివాహం త్వరలోనే జరగనుందని రకరకాల డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇప్పుడు లేటెస్ట్ తగా వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది.
పెళ్లి డేట్ ఫిక్స్..
విజయ్ - రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందని గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా 2026 ఫిబ్రవరి 26వ తేదీన వీరి వివాహం జరగనుందని పోస్టులు పెడుతున్నారు. అందుకు రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ వేదిక కానున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు విజయ్ ప్రస్తుతం రౌడీ జనార్ధన సినిమాలో నటిస్తుండగా.. రష్మిక తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో బిజీగా ఉంది.
కాగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన విజయ్.. పెళ్లి చూపులు మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డితో తిరుగులేని సక్సెస్ అందుకొని గీతాగోవిందం మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత నుంచి వరుసగా ఫ్లాప్స్ రావడంతో కొంచెం స్లో అయ్యారు. ఈ ఏడాది కింగ్‌డమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. నేషనల్ క్రష్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది "రష్మిక మందన్నా". ప్రస్తుతం దక్షిణ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస చిత్రాలతో కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.












Click it and Unblock the Notifications