Ibomma రవిపై తెలుగు హీరో ప్రశంసలు..వాడు పెద్ద తోపు అంటూ
ఇంటర్నెట్ ప్రపంచంలో ఒకప్పుడు ఓటీటీ సంస్థలకు, చిత్ర పరిశ్రమకు కంటి మీద కునుకు లేకుండా చేసిన అతిపెద్ద పైరసీ సామ్రాజ్యం 'ఐబొమ్మ' (iBomma). 'ఉచితంగా వినోదం' పేరుతో కోట్లాది రూపాయల ఆదాయాన్ని దొంగిలించిన ఈ వెబ్‌సైట్‌ను చేధించడం అసాధ్యం అని అంతా అనుకున్నారు. దమ్ముంటే పట్టుకోండి అంటూ ఏకంగా పోలీసులకే సవాల్ విసిరిన ఈ అదృశ్య సామ్రాజ్యంపై తెలంగాణ పోలీసులు ఎట్టకేలకు మెరుపుదాడి చేసి, శాశ్వతంగా తాళం వేశారు.
ఈ పైరసీ నెట్‌వర్క్‌ను ఇంటర్నెట్ లోకం నుంచి ఛేదించడం అసాధ్యం అని అంతర్జాతీయ నిపుణులు సైతం అభిప్రాయపడ్డారు. కానీ, తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు ఆ సవాల్‌ను స్వీకరించారు. కరేబియన్ దీవుల్లో తలదాచుకున్నట్లు భావిస్తున్న ఐబొమ్మ, బప్పం టీవీ (Bappam TV) వెబ్‌సైట్‌ల ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని శనివారం అరెస్ట్ చేసి, అతిపెద్ద 'డిజిటల్ ఆపరేషన్'కు తెరదించారు. రవిని పట్టుకోవడంలోనే అసలు ట్విస్ట్ ఉంది. అతను ఎంత జాగ్రత్తగా దాగి ఉన్నా, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు అతడిని వలపన్ని పట్టుకున్నారు.

పోలీసులు రవి నుంచి వందల సంఖ్యలో హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ డిస్కులలోని డేటాను లోతుగా విశ్లేషిస్తున్నారు.'ఐబొమ్మ' రవి అరెస్ట్ కావడంతో చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలు పోలీసులను అభినందించారు. సీపీ సజ్జనార్‌ను కలిసి అభినందనలు తెలియజేశారు.'ఐబొమ్మ' రవి వల్ల ఇండస్ట్రీ వేల కోట్లు నష్టపోయిందని వీరు అభిప్రాయపడ్డారు.
అయితే అనుహ్యంగా 'ఐబొమ్మ' రవికి సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభించింది. నటుడు శివాజీ 'ఐబొమ్మ' రవిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన ఓ ఈవెంట్‌లో 'ఐబొమ్మ' రవి గురించి మాట్లాడుతూ..ఆ అబ్బాయి చాలా టాలెంటెడ్, మంచి హ్యాకర్ అంట. వాడు నిజంగా దేశానికి ఉపయోగపడగల వ్యక్తి. అతన్ని మంచి పనికి, ఏదైనా సెక్యూరిటీ సిస్టమ్‌లో వాడుకోవాలని కోరుకుంటున్నాను.
రవి చేసిన పని దుర్మార్గమైనదే అయినప్పటికీ, అతనిలోని టాలెంట్ గొప్పదని కితాబు ఇచ్చారు. తెలిసీ తెలియని వయస్సు, డబ్బు లేనితనం వంటి కారణాల వల్ల అతని మైండ్‌లో అలాంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు అని శివాజీ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, రాజ్యాంగానికి లోబడి బతకాలి కాబట్టి, ఇకనైనా రవి మారాలని కోరుకుంటున్నా అంటూ శివాజీ తెలిపారు.అయితే, శివాజీ పైరసీని ప్రోత్సహించే విధంగా రవిని పొగడటంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. లక్షలాది మంది జీవితాలను, వేల కోట్ల పరిశ్రమను దెబ్బతీసిన వ్యక్తిని 'టాలెంటెడ్' అంటూ ఒక నటుడు బహిరంగంగా పొగడటం సరికాదని దుమ్మెత్తిపోస్తున్నారు.
-
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమంత "వావ్" వీడియో వైరల్..!












Click it and Unblock the Notifications