26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు

మనకు తెలుగు సినీ పరిశ్రమలో నలుగు అగ్ర కథానాయకులున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఈ నలుగురు కొన్ని దశాబ్దాలుగా అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్నారు. వీరి తర్వాత తరం హీరోలు కూడా వచ్చారు. మహేష్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, అల్లు అర్జున్ లాంటివారంతా రికార్డులమీద రికార్డులు సాధించుకుంటూ వెళుతున్నారు.

అయితే 26 సంవత్సరాలుగా విక్టరీ వెంకటేష్ నెలకొల్పిన రికార్డును ఏ హీరో కూడా అధిగమించలేకపోతున్నారు. ఆ రికార్డును భవిష్యత్తులో కూడా ఎవరూ బద్దలు కొట్టలేరనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో 50 రోజులు, 100 రోజులు పూర్తిచేసుకుంది. ఇది నిజంగా సంచలన రికార్డు అని చెప్పొచ్చు. అది ఏ సినిమా అంటే కలిసుందాం రా.

telugu-star-heroes-who-have-been-unable-to-break-venkateshs-record-for-26-years

ఉత్తమ నటుడిగా అవార్డు

అంతేకాదు.. అప్పటివరకు ఇండస్టీ హిట్ గా ఉన్న సమరసింహారెడ్డి రికార్డును కూడా బద్దలు కొట్టింది. కేవలం ఒక కుటుంబ కథా చిత్రంతో వెంకీ దీన్ని సాధించారు. అప్పటివరకు అందరి హీరోల సినిమాలు 50 రోజులు, 100 రోజులు ఆడాయికానీ మధ్యలో కేంద్రాలు మారడం, థియేటర్లు మారడం జరిగేది. దీనివల్ల అవి అత్యుత్తమమైన రికార్డులు అనిపించుకోలేదు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి మాస్ హీరోలకు కూడా సాధ్యంకాని రికార్డును వెంకటేష్ సాధించారు.

వెంకీ సోదరుడు డి.సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు. సిమ్రాన్ కథానాయిక. కె.విశ్వనాథ్, విజయకుమారి, రంగనాథ్, శ్రీహరి, రాళ్లపల్లి, బ్రహ్మానందం, కల్పనారాయ్ తదితరులు నటించారు. ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించగా, ఎస్.ఏ. రాజ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా 2000 సంవత్సరంలో విడుదల కాగా, 2002లో కుచ్ తుమ్ కహో కుచ్ హామ్ కహెన్ క పేరుతో రీమేక్ చేశారు.

దీన్ని ఎవరూ అధిగమించలేరు

కలిసుందాంరా చిత్రానికి వెంకీ ఉత్తమ నటుడిగా నంది అవార్డును గెలుచుకున్నారు. అనేక ఫిలింఫేర్ అవార్డులు కూడా దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును దక్కించుకుంది. అప్పట్లో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. క్లీన్ ఎంటర్ టైనర్ గా, చక్కటి కుటుంబ కథాచిత్రంగా కలిసుందాంరా సినిమా ప్రేక్షకుల మదిని దోచింది. ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాలు రెండువారాలకు మించి ఆడటంలేదు. మరో 26 సంవత్సరాలు గడిచినా విడుదలైన అన్ని కేంద్రాల్లో 50 రోజులు, 100 రోజులు ఆడటం గగనమే అని చెప్పొచ్చు. కాబట్టి తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం ఈ రికార్డు వెంకటేష్ పేరుపైనే ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+