మనదేశం మొత్తం మీద రూ.1,000 కోట్లు సాధించిన సినిమాల లిస్టు

భారతదేశంలో 'బాక్సాఫీస్' అనే పదానికి అర్థం మారిపోతోంది. ఒకప్పుడు రూ.వంద కోట్లు సాధిస్తేనే అద్భుతం అనుకునేవారు. కానీ ఈరోజు రూ.వెయ్యి కోట్లు వస్తే అద్భుతం అంటున్నారు. తర్వాత రూ.2వేల కోట్లు వస్తేనే అద్భుతం అనే రోజులు రానున్నాయనిపిస్తోంది. వాస్తవానికి భారతీయ సినీ మార్కెట్ ఎంత శక్తివంతమైందో రాజమౌళి సృష్టించిన 'బాహుబలి 2' ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపించింది. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం కేవలం టాలీవుడ్‌కు, బాలీవుడ్ కు పరిమితం కాలేదు. అంతర్జాతీయస్థాయి మార్కెట్ వరకు వెళ్లింది. బాహుబలికి ముందు అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' చిత్రం చైనాలో కూడా భారతీయ సినిమాలకు అద్భుతమైన ఆదరణ ఉంటుందని నిరూపించగా, బాహుబలి 2 ఆ ఊపును కొనసాగించింది.

పాన్ ఇండియాకు దారి చూపిన బాహుబలి

బాహుబలి తర్వాత పాన్ ఇండియా హవా ప్రారంభమైంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, పఠాన్, జవాన్, కల్కి, పుష్ప2 లాంటి సినిమాలన్నీ వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ ను దాటాయి. భారతీయ సినీ చరిత్రలో అత్యంత వేగంగా వెయ్యి కోట్లు సాధించిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించిన పుష్ప2 రూ. 1,775 కోట్లకు పైగా గ్రాస్‌తో అమీర్ ఖాన్, ప్రభాస్ రికార్డులకు అతి సమీపంలో నిలిచింది. దీంతో ఒకే ఏడాది టాలీవుడ్ నుంచి కల్కి, పుష్ప2 ద్వారా రెండు వెయ్యి కోట్ల సినిమాలు రావడం విశేషంగా మారింది. 2025లో విడుదలైన 'దురంధర్' బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది. రూ.1300 కోట్ల కలెక్షన్లతో భారతీయ ఆల్‌టైమ్ హిట్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది. అయితే వీటిల్లో మన తెలుగు సినిమాలదే ఆధిపత్యం.

Thousand Crore Gross Here Is The List of The indian Movies Which Hits this milestone

మనదేశంలో ఇప్పటివరకు 9 సినిమాలు రూ.వెయ్యి కోట్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.
1. దంగల్ అమీర్ ఖాన్ రూ. 2,024 కోట్లు
2. బాహుబలి 2 ప్రభాస్ రూ.1,810 కోట్లు
3. పుష్ప 2 అల్లు అర్జున్ రూ.1775 కోట్లు
4. దురంధర్ రణవీర్ సింగ్ రూ.1428 కోట్లు
5. ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ రూ.1387 కోట్లు
6. కేజీఎఫ్ 2 యష్ రూ.1250 కోట్లు
7. జవాన్ షారుక్ ఖాన్ రూ.1148 కోట్లు
8. కల్కి ప్రభాస్ రూ.1200 కోట్లు
9. పఠాన్ షారుక్ ఖాన్ రూ.1050 కోట్లు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+