గట్టిగా కొట్టబోతున్న టాలీవుడ్ హీరో.. ప్రాణం పెట్టాడు
కిందటి నెల సంక్రాంతికి విడుదలైన మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడీ టాలీవుడ్ యంగ్ హీరో. అదే ఊపులో కొత్త సినిమాకు రెడీ అయ్యాడు. దీనికోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యాడు. బరువు సైతం తగ్గాడు. గుర్తు పట్టనంతగా మారిపోయాడు. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందీ ఫిల్మ్. విడుదలకు సిద్ధమైంది. తాజాగా రిలీజ్ తేదీని ప్రకటించిందీ చిత్రం యూనిట్. టైటిల్ కు తగ్గట్టే తనను తాను మలచుకున్నాడు.
అతనే- శర్వానంద్. నారి నారి నడుమ మురారి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్నాడు. తన నెక్స్ట్ మూవీ బైకర్ కు సిద్ధం అయ్యాడు. నిజానికి- గత డిసెంబర్ 6వ తేదీన విడుదల కావాల్సిన మూవీ ఇది. గ్రాఫిక్స్ కారణంగా వాయిదా పడింది. నిర్మాతలు విడుదల తేదీని నిరవధికంగా వేశారు. తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించింది. అభిలాష్ రెడ్డి కంకారా దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ నిర్మించిన బైకర్ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ స్పోర్ట్స్-ఫ్యామిలీ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

టీజర్‌లో శర్వానంద్ కష్టం ఏమిటనేది స్పష్టంగా కనిపించింది. హై ఆక్టేన్ బైక్ రేసింగ్ స్టంట్స్ ఆకట్టుకున్నాయి. మాళవికా నాయర్‌తో ఆయన కెమిస్ట్రీ హైలైట్ అయింది. కొత్త పోస్టర్‌లో శర్వానంద్ స్టైలిష్ బైకర్ లుక్‌లో కనిపించాడు. రేసింగ్ సన్నివేశాలతోపాటు సినిమాలోని ఎమోషనల్ సీన్లపై మంచి అంచనాలు ఉన్నాయి. సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్ర పోషించడం ప్లస్ పాయింట్. వేసవిలో విడుదల కాబోతోండటంతో ప్రమోషన్లపై కాన్సన్ ట్రేట్ చేసింది చిత్రం యూనిట్.
ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ ముగిసినట్లు తెలుస్తోంది. నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా దాదాపు 35 కోట్ల రూపాయల టేబుల్ ప్రాఫిట్ అందినట్లు చెబుతున్నారు. దిల్ రాజు బైకర్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. అలాగే నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది శర్వానంద్ చిత్రానికి మంచి డీల్. శర్వానంద్ ప్రస్తుతం సంపత్ నంది 'భోగి' షూటింగ్‌లో ఉన్నారు. ఆ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలవుతుంది. శ్రీను వైట్లతో మరో మూవీ చేయనున్నాడు.












Click it and Unblock the Notifications