ప్రభాస్‌కు బాగా ఇష్టమైన బాలయ్య సినిమా ఏదో తెలుసా?
ప్రతి హీరోకు ఒక సాధారణ ప్రేక్షకుడిలా ఇష్టమైన సినిమాలుంటాయి. అలాగే పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ కు కూడా నందమూరి నటసింహం బాలయ్య సినిమాల్లో ఒక సినిమా అంటే చాలా ఇష్టం. బాలయ్య కుటుంబానికి, ప్రభాస్ కుటుంబానికి మంచి సంబంధ బాంధవ్యాలున్నాయి. ప్రభాస్ నాన్న సూర్యనారాయణరాజు, పెదనాన్న కృష్ణంరాజుతో చనువుగా మెలిగేవారు బాలకృష్ణ. ఈ కారణంతోనే ప్రభాస్ బాలయ్యకు ఎంతో గౌరవం ఇస్తూనే సార్ అని సంభోదిస్తుంటాడు.
కల్కికి ప్రేరణ ఆదిత్య 369
తెలుగు చలనచిత్ర చరిత్రలో టైమ్ మెషిన్ నేపథ్యంలో వచ్చిన మొదటి సాహసోపేతమైన ప్రయోగం 'ఆదిత్య 369'. ఈ విజువల్ వండర్ అంటే ప్రభాస్ కు ఎంతో ఇష్టం. అన్ స్టాపబుల్ షోకు వచ్చినప్పుడు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా తనకు స్ఫూర్తి అని చెప్పారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య చేసిన ఈ ప్రయోగం, అప్పట్లో ఉన్న పరిమిత వనరులతోనే హాలీవుడ్ స్థాయి విజువల్స్‌ను అందించింది. ప్రభాస్ నటించిన కల్కిలాంటి సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు ఇది ఒక ప్రేరణగా నిలిచిందని, అందుకే ఆదిత్య 369 అంటే తనకు బాగా ఇష్టమన్నారు ప్రభాస్.

సలార్ షూటింగ్ కు వెళ్లిన బాలయ్య
కేవలం ప్రయోగాత్మక చిత్రాలే కాకుండా, బాలకృష్ణ మార్క్ మాస్ యాక్షన్ సినిమాలను కూడా డార్లింగ్ బాగా ఇష్టపడతాడు. ముఖ్యంగా బాలయ్య చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, ఆయనలోని ఎనర్జీ తనను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయని చెప్పారు. 'అన్‌స్టాపబుల్' షోలో బాలయ్యతో కలిసి సందడి చేసినప్పుడు, ఆయన టైమింగ్, జోష్ చూసి ప్రభాస్ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒక సీనియర్ హీరో ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేయడం గ్రేట్ అంటూ వేదికపైనే కొనియాడారు.
గతంలో ప్రభాస్ ఆహ్వానం మేరకు బాలకృష్ణ 'సలార్' షూటింగ్ సెట్స్‌కు వెళ్లడం, అలాగే 'అన్‌స్టాపబుల్' షోకు ప్రభాస్ రావడం వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటిచెప్పాయి. ఆ షోలో ప్రభాస్ వ్యక్తిగత విషయాల గురించి బాలయ్య అడిగినప్పుడు, ప్రభాస్ ఎంతో వినయంగా సమాధానాలు ఇస్తూనే, బాలయ్య సినిమాలలోని ఫైట్స్, డ్యాన్సులంటే ఇష్టమని చెప్పారు. సీనియర్ హీరోలన్నా, పెద్దవారన్నా తనకు ఎంత గౌరవమో ప్రభాస్ ఈ షోద్వారా మరోసారి నిరూపించారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ?












Click it and Unblock the Notifications