చంద్రబాబుకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగంగా 'నాకు ఫలానా హీరో అంటే ఇష్టం' అని ఎప్పుడూ, ఎవరి పేరు చెప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు వ్యక్తిత్వం ప్రకారం, సినిమా కంటే పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాస్తవానికి ఆయనకు సినిమాలు చూసే సమయం ఉండదు.
అయితే, ఆయన కుటుంబ నేపథ్యం, రాజకీయ సంబంధాలను బట్టి చూస్తే సినీ పరిశ్రమకు సంబంధించి అత్యంత ఇష్టం ఉన్న వారు నలుగురున్నారు. వారి గురించి తెలుసుకుందాం.

నందమూరి తారక రామారావు
చంద్రబాబుకు రాజకీయ గురువు, పిల్లనిచ్చిన మామ. దీంతో బాబుకు ఎన్టీఆర్ అంటే అమితమైన గౌరవం. ఎన్టీఆర్ కేవలం ఒక హీరోగానే కాకుండా, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తిగా చంద్రబాబు అభిమానిస్తారు. క్రమశిక్షణ, సమయపాలన, ప్రజా సేవలో ఎన్టీఆర్ సిద్ధాంతాలను ఆయన తరచుగా సభల్లో కూడా చెబుతుంటారు. వాటిని అందరం అలవరుచుకోవాలంటారు.

నందమూరి బాలకృష్ణ
బాలయ్య సొంత బావమరిది అవుతారు. అలాగే హిందూపురం ఎమ్మెల్యేగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణినే చంద్రబాబు కుమారుడు లోకేష్ పెళ్లిచేసుకున్నారు. ఈ రకంగా కూడా ఇద్దరూ వియ్యంకులయ్యారు. ఇలా చంద్రబాబుకు బాలకృష్ణతో మంచి అనుబంధం ఉంది. అంతేకాకుండా సినిమాల్లో పౌరాణిక పాత్రలు, ఆయన ఎనర్జీని చంద్రబాబు మెచ్చుకుంటారు. షూటింగ్‌లు ఉన్నా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటాన్ని అభినందిస్తారు.

పవన్ కళ్యాణ్
ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబుకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. పవన్ కళ్యాణ్ కేవలం ఒక హీరోగానే కాకుండా, సమాజం కోసం తన సినిమా కెరీర్‌ను పక్కన పెట్టి పోరాడే మనస్తత్వం కలవారని చంద్రబాబు పలు సందర్భాల్లో కొనియాడారు. ఆయన నిబద్ధత, నిస్వార్థ రాజకీయ ప్రస్థానం, ప్రజలకు మేలు చేయాలనే నిరంతర తపన చంద్రబాబును బాగా ఆకట్టుకుంది. అందుకే ఆయన పవన్ ను బాగా ఇష్టపడతారు.

మహేష్ బాబు
గతంలో కొన్ని సందర్భాల్లో మహేష్ బాబు గురించి చంద్రబాబు ఎంతో సానుకూలంగా మాట్లాడారు. ముఖ్యంగా మహేష్ బాబు 'శ్రీమంతుడు' వంటి సినిమాల ద్వారా గ్రామాలను దత్తత తీసుకోవాలనే సందేశాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆయన ఆ పనిని అభినందించారు. ఎందుకంటే మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు.












Click it and Unblock the Notifications