14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు
కింగ్ అక్కినేని నాగార్జున నవతరాన్ని ప్రోత్సహిస్తారు. ఎక్కడ టాలెంట్ ఉన్నా పట్టుకుంటారు. ఇలా ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశాలిచ్చి వారిని స్టార్ దర్శకులుగా చేశారు. నాగార్జున ఒక సినిమా ఒప్పుకున్నారంటే స్క్రిప్ట్ ను అన్నివిధాలుగా అంచనా వేసుకొని ఒప్పుకుంటారు. ఆయన్ను ఒప్పించడం అంత సులువుకాదు. ఏది పడితే అది ఒప్పుకోరు. అలాంటి నాగార్జున 2012లో ఓ సోషియో ఫాంటసీ చిత్రం చేశారు. దాని పేరు'ఢమరుకం'. 2012 నవంబరు 23వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద, సాంకేతికంగా కొన్ని ప్రత్యేకమైన రికార్డులను నెలకొల్పింది. 14 సంవత్సరాలుగా ఈ సినిమా రికార్డును ఏ హీరో అధిగమించలేకపోతుండటం విశేషం.
రికార్డు నెలకొల్పిన ఢమరుకం
తెలుగు చిత్ర పరిశ్రమలో నవంబర్ నెలలో విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'ఢమరుకం' రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమా విడుదలై 13 ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ నవంబర్ నెలలో వచ్చిన సినిమాల్లో అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా లిఖించుకున్న రికార్డు పదిలంగానే ఉంది. అంతేకాకుండా ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ పనికి సంబంధించి భారతీయ సినిమాల్లోనే ప్రత్యేక రికార్డును కైవసం చేసుకుంది. అప్పటివరకు ఏ తెలుగు సినిమాలోనూ లేని విధంగా సుమారు 70 నిమిషాల పాటు భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న మొదటి చిత్రంగా ఇది నిలిచింది.
రూ.100 కోట్లు ఎక్కువసార్లు సాధించిన ఏకైక హీరో

రూ.48 కోట్ల భారీ వసూళ్లు
ఫైర్‌ఫ్లై క్రియేటివ్ స్టూడియో ఆధ్వర్యంలో 150 మంది నిపుణులు దాదాపు ఏడాదిన్నర పాటు శ్రమించి ఈ గ్రాఫిక్స్‌ను రూపొందించారు. ఢమరుకం విడుదలయ్యే సమయచానికి నాగార్జున కెరీర్‌లోనే రూ.40 కోట్ల అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 48 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. అప్పట్లో నాగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే అంధకాసురుడి పాత్ర, గ్రాఫిక్స్ అప్పట్లో ఒక ట్రెండ్ ను సృష్టించాయి. అంధకాసురుడి పాత్రను సాయికుమార్ సోదరుడు రవిశంకర్ పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి.












Click it and Unblock the Notifications