ఆ సినిమా వదులుకోవడమే ప్రభాస్ కెరీర్‌కు ‘శ్రీరామరక్ష’
Tollywood: సినిమా పరిశ్రమలో ఏ కథను ఎంచుకొని సినిమా చేయాలి అనేదానికన్నా ఏ కథను వద్దనుకున్నారనేదే ముఖ్యమవుతుంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే అలా వద్దనుకున్న సినిమాలు భారీ డిజాస్టర్లుగా మిగిలేవి. తీసుకున్న నిర్ణయం సరైందే అని నిరూపించేవి. ఇలాంటి నిర్ణయాలు ఏ ఏ హీరోకైనా వర్తిస్తాయి. ఏ కథను వద్దనుకున్నారనేదే చాలా తెలివైన నిర్ణయం. బాగున్న కథను ఎంచుకొని సినిమా చేయడంకన్నా రిజెక్ట్ చేయడం చాలా ప్రదానం. ఇలా సినిమాను ఎంచుకోవడంలో, తిరస్కరించడంలో ప్రభాస్, అల్లు అర్జున్ చాలా తెలివిగా ఉంటారు.
నిండా మునిగిపోయిన ఎన్టీఆర్, అశ్వనీదత్
దర్శకుడు మెహర్ రమేష్ 'కంత్రి' సినిమా తర్వాత ప్రభాస్‌ను కలిసి రెండు భారీ బడ్జెట్ కథలను వినిపించారు. అందులో ఒకటి స్టైలిష్ యాక్షన్ డ్రామా 'బిల్లా' కాగా, రెండోది సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే 'శక్తి'. అప్పట్లో మెహర్ రమేష్ చెప్పిన 'శక్తి' కథ ఎందుకో డార్లింగ్ కు నచ్చలేదు. ఆ కథలో ఉన్న లోపాలను ముందే పసిగట్టి వద్దన్నారు. తెలివిగా బిల్లాను ఎంచుకున్నారు.ప్రభాస్ రిజెక్ట్ చేసిన అదే 'శక్తి' కథను జూనియర్ ఎన్టీఆర్ ఓకే చేశారు. భారీ బడ్జెట్, అశ్విని దత్ వంటి టాప్ ప్రొడ్యూసర్ తీసిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత దారుణమైన పరాజయం పొందిన సినిమాల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది. ఒకరకంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పై శక్తి సినిమా మాయని మచ్చలా పడింది.

అది చేసుంటే బాహుబలి ఉండేది కాదు
ఒకవేళ ఈ సినిమాను ప్రభాస్ చేసివుంటే అతనికి బాహుబలి లాంటి అవకాశాలు వచ్చేవి కావు. ఎందుకంటే శక్తి సినిమాతోనే కెరీర్ కుప్పకూలేది. కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టేదో. సింహాద్రి, కిక్ లాంటి సినిమాలు వదులుకున్నప్పుడు ఉన్న బాధకన్నా, శక్తి లాంటి సినిమాను వద్దనుకున్నప్పుడు కలిగిన ఆనందమే డార్లింగ్ కు ఎక్కువ. తన కెరీర్ లో చాలా తెలివిగా తీసుకున్న నిర్ణయం అని చెప్పొచ్చు. మెహర్ రమేశ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రియులంతా దడుచుకుంటున్నారు. వెంకటేష్ కు షాడో, చిరంజీవికి తాజాగా భోళాశంకర్ పేరుతో రెండు భారీ డిజాస్టర్లు ఇచ్చి వారి కెరీర్ పై కూడా మాయని మచ్చ వేశాడు. కథ చెప్పేటప్పుడు వేరు.. తీసేటప్పుడు వేరుగా ఉంటుంది మెహర్ రమేశ్ శైలి. దీనివల్లే అతను పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయాడు. భవిష్యత్తులో కూడా అతన్నుంచి ఎటువంటి సినిమాలు వచ్చే అవకాశాలు 100 శాతం లేవని చెప్పొచ్చు.
-
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
రీసెంట్ టైమ్ లో బెస్ట్ టీజర్.. నవ్వి నవ్వి పొట్ట చెక్కలే..!! -
పెళ్లి కంటే సహజీవనం బెస్ట్: మెగా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ -
రాజకీయ వారసురాలు.. గ్లామర్ తార.. రామ్‌చరణ్ బ్యూటీని చుట్టుముట్టిన వివాదం! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
కొత్త బిజినెస్ షురూ చేసిన తెలుగు యాంకర్..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !!












Click it and Unblock the Notifications