జూనియర్ ఎన్టీఆర్ కోసం ధనుష్‌ను వదిలేసిన హీరోయిన్

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా రుక్మిణి వసంత్ పేరే వినిపిస్తోంది. 'సప్త సాగరదాచై ఎల్లో' సినిమాతో కుర్రకారు గుండెల్లో తిష్ట వేసిన ఈ కన్నడ కస్తూరి, ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే, ఒకేసారి ఇద్దరు అగ్ర హీరోల సినిమాల్లో అవకాశం వచ్చింది. కానీ అందులో ఒకరిని మాత్రమే ఎంచుకోవాల్సి రావడంతో ఈ బ్యూటీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదగాలంటే కేవలం అందం, అభినయం ఉంటే సరిపోదు.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే నేర్పు కూడా ఉండాలి. ప్రస్తుతం నటి రుక్మిణి వసంత్ సరిగ్గా ఇదే చేస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కోలీవుడ్ స్టార్ ధనుష్.. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే, ఆమె ఎన్టీఆర్ వైపు మొగ్గు చూపింది. తెలుగు, తమిళం, కన్నడ పరిశ్రమల్లో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

ధనుష్ సరసన సారా అర్జున్

ప్రస్తుతం రుక్మిణి వసంత్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్'లో హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న దానికంటే ఆలస్యం కావడంతో, ఎన్టీఆర్ సినిమాకు అదనపు డేట్లు అవసరమయ్యాయి. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ధనుష్ కొత్త ప్రాజెక్ట్ నుంచి రుక్మిణి తప్పుకోవడంతో, ఆ లక్కీ ఛాన్స్ 'పొన్నియిన్ సెల్వన్', 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్‌ను వరించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సారా, ఇప్పుడు ధనుష్ సరసన హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. తెలుగులో 'యుఫోరియా' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సారాకు ఇది కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ అని చెప్పవచ్చు.

Tollywood This actress Dumped tamil actor dhanush for Junior NTR

రుక్మిణి లెక్కలు వేరేలా ఉన్నాయి

ఎన్టీఆర్ సినిమా కోసం ధనుష్ వంటి హీరో సినిమాను వదులుకోవడం ఒక రకంగా రిస్క్ అనిపించినా, రుక్మిణి లెక్కలు వేరేలా ఉన్నాయి. 'కేజీఎఫ్', 'సలార్' వంటి చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తే, ఆ గుర్తింపు దేశవ్యాప్తంగా వస్తుందని ఆమె నమ్మకం. 'కాంతార' సినిమాలతో ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి, ఇప్పుడు 'డ్రాగన్'తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా ఉన్న రష్మిక మందన్నకు గట్టి పోటీ ఇచ్చే సత్తా ఉన్న హీరోయిన్‌ రుక్మిణి అని సినీ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. రుక్మిణి చేతిలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. శివకార్తికేయన్ సరసన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది. ఒకవైపు కమర్షియల్ సక్సెస్, మరోవైపు స్టార్ హీరోల సినిమాలతో ఈ అమ్మడు తన భవిష్యత్తును చాలా చక్కగా ప్లాన్ చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+