Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రపంచంలోనే అత్యంత అందమైన టాప్ 10 హీరోయిన్స్ వీళ్లే ???

చిత్ర పరిశ్రమలో టాలెంట్ తో పాటు అందం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. గ్లామర్ తో గుండెల్ని కొల్లగొట్టే ఎందరో సుందరీమణులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమలో భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ ని సంపాదించుకొని రాణిస్తున్నారు. అలా ఈ ఏడాది అత్యంత అందమైన హీరోయిన్ల జాబితా ఒకటి రిలీజ్ అయ్యింది. ఐఎమ్డీబీ ఈ ఏడాది కోసం ప్రపంచవ్యాప్తంగా టాప్‌ టెన్‌ హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో పలు దేశాల భామలు చోటు దక్కించుకోగా.. ఈ టాప్ లిస్ట్ చూసి ఆడియన్స్ సైతం ఫుల్ ఫిదా అవుతున్నారు.

ఈ అందాల తారల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన మార్గోట్ రాబీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అమెరికా బ్యూటీ షైలీన్ వుడ్లీ రెండో స్థానంలో నిలిచింది. మూడు, నాలుగు ప్లేసుల్లో చైనాకు చెందిన దిల్‌రుబా దిల్మురాత్, సౌత్ కొరియా బ్యూటీ నాన్నీ మెక్‌డోనీ నిలిచారు. ఇండియా నుంచి కేవలం ఒకే ఒక్క హీరోయిన్ కు మాత్రమే స్థానం దక్కింది. టాప్‌-5 లో బాలీవుడ్ భామ కృతి సనన్‌ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన హానియా అమీర్ ఆరోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా స్పెయిన్‌కు చెందిన అనా డి అర్మాస్, పారిస్‌కు చెందిన ఎమ్మా వాట్సన్, అమెరికాకు చెందిన అంబర్ హెర్డ్, టర్కీ బ్యూటీ హ్యాండే ఎర్సెల్‌ నిలిచారు.

top-10-most-beautiful-heroines-in-the-world-for-year-2025

ఐఎండీబీ లిస్ట్ ప్రకారం అందమైన టాప్-10 హీరోయిన్లు ఎవరంటే..

మార్గోట్ రాబీ (Margot Robbie)..

హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో మార్గోట్ రాబీ ఒకరు. ఆస్ట్రేలియాకు చెందిన ఆమె "ది వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్", "సూసైడ్ స్క్వాడ్", "బార్బీ" వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. బలమైన నటనతో కూడిన పాత్రలను ఎంచుకోవడంలో ఆమె ప్రత్యేకత చూపిస్తారు. నిర్మాతగా కూడా మార్గోట్ తన ప్రతిభను నిరూపించుకున్నారు.

షైలీన్ వుడ్లీ (Shailene Woodley)..

షైలీన్ వుడ్లీ హాలీవుడ్‌లో సహజమైన నటనకు పేరొందిన నటి. "ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్", "డైవర్జెంట్" సిరీస్ సినిమాలు ఆమెకు యువతలో విపరీతమైన క్రేజ్‌ను తెచ్చాయి. నటనతో పాటు పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల్లో కూడా ఆమె చురుకుగా పాల్గొంటారు.

దిల్రాబా దిల్మురత్ (Dilraba Dilmurat)..

చైనా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో దిల్రాబా దిల్మురత్ అగ్రస్థానంలో ఉన్న నటి. ఉయ్‌ఘూర్ వంశానికి చెందిన ఆమె.. చైనా టీవీ సిరీస్‌లు, సినిమాల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందం, అభినయం, డ్యాన్స్‌లో సమాన నైపుణ్యం ఉన్న దిల్రాబా ఆసియా యువతకు స్టైల్ ఐకాన్‌గా మారారు.

నాన్సీ మెక్‌డోనీ (Nancy McDonie)..

నాన్సీ మెక్‌డోనీ దక్షిణ కొరియాలోని ప్రముఖ K-pop గర్ల్ గ్రూప్ MOMOLAND సభ్యురాలు. ఆమె అమెరికన్-కొరియన్ నేపథ్యంతో, గాయని, నటి, డ్యాన్సర్‌గా బహుముఖ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఆమె ఉత్సాహభరితమైన ప్రదర్శనలు, అందమైన హావభావాలు యువతను విశేషంగా ఆకర్షిస్తాయి.

కృతి సనన్ (Kriti Sanon)..

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న కృతి తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. మహేష్ బాబు నేనొక్కడినే సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అందాల తార ఆ తర్వాత దోచెయ్ సినిమాలోనూ నటించింది. ఇక ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో సీతగా నటించి అందరి మన్ననలు అందుకుంది. "హీరోపంటి", "మిమి", "ఆదిపురుష్" వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో తన నటనా సామర్థ్యాన్ని నిరూపించారు. "మిమి" సినిమాలో నటనకు జాతీయ అవార్డు పొందడం ఆమె కెరీర్‌లో కీలక మైలురాయిగా చెప్పొచ్చు.

హనియా అమీర్ (Hania Aamir)..

పాకిస్థాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో హనియా అమీర్ యువతలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి. టీవీ సీరియల్స్, సినిమాల్లో ఆమె సహజమైన నటనకు మంచి పేరు ఉంది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హనియా, తన స్టైల్ మరియు చలాకీతనంతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు.

అనా డి అర్మాస్ (Ana de Armas)..

క్యూబా నుంచి హాలీవుడ్‌కు ఎదిగిన అనా డి అర్మాస్, "నైవ్స్ అవుట్", "నో టైమ్ టు డై", "బ్లాండ్" వంటి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. హాలీవుడ్‌లో లాటిన్ నటీమణుల ప్రతినిధిగా అనా ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.

ఎమ్మా వాట్సన్ (Emma Watson)..

ఎమ్మా వాట్సన్ పేరు చెప్పగానే "హ్యారీ పోటర్" సిరీస్‌లోని హెర్మియినీ పాత్ర గుర్తుకు వస్తుంది. బాలనటిగా ప్రారంభమైన ఆమె కెరీర్, తరువాత "బ్యూటీ అండ్ ది బీస్ట్" వంటి చిత్రాలతో మరింత ఎత్తుకు చేరింది. నటనతో పాటు మహిళా హక్కులు, విద్యా పరిరక్షణకు సంబంధించిన ఉద్యమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటున్నారు.

అంబర్ హర్డ్ (Amber Heard)..

అంబర్ హర్డ్ హాలీవుడ్‌లో విభిన్న పాత్రలతో గుర్తింపు పొందిన నటి. "ఆక్వామ్యాన్" చిత్రంలో మేరా పాత్రతో ఆమెకు గ్లోబల్ క్రేజ్ లభించింది. వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఎదురైనా, నటిగా తన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నారు.

హ్యాండే ఎర్సెల్ (Hande Erçel)..

టర్కీ టెలివిజన్ ఇండస్ట్రీలో హ్యాండే ఎర్సెల్ అగ్రశ్రేణి నటి. "సెన్ చల్ కపిమి" వంటి సిరీస్‌లతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించారు. ఆమె అందం, నటన, ఫ్యాషన్ సెన్స్ టర్కీతో పాటు ఇతర దేశాల్లోనూ ఆదరణ పొందాయి. బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లలో కూడా ఆమె ముందంజలో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+