ప్రభాస్ ను దించేసిన మెగా హీరో: అదే జానర్.. అదే గెటప్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ.. రాజా సాబ్. మారుతి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఫాంటసీ హారర్ కామెడీ మూవీ.. ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, జరీనా వహాబ్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇదే హారర్ కామెడీ జానర్ బాట పట్టాడు మెగా కాంపౌండ్ హీరో.. వరుణ్ తేజ్. అతని బర్త్ డే సందర్భంగా గ్లింప్లెస్ విడుదల అయ్యాయి. ఈ చిత్రానికి కొరియన్ కనకరాజు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నాయి. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్నాడు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. తేదీని ప్రకటించలేదు గానీ.. వచ్చే వేసవిలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని వెల్లడించింది చిత్రం యూనిట్. వరుణ్ తేజ్ నటిస్తోన్న 15వ సినిమా ఇది.ఓ మంచి హిట్ కొట్టి చాలాకాలమైంది వరుణ్ తేజ్ కు. ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్ 2, ఎఫ్ 3 తప్ప ఈ మధ్యకాలంలో అతని కేరీర్ లో చెప్పుకోవడానికి హిట్సేమీ లేవు. ఘనీ, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వేలంటైన్, మట్కా సినిమాలు ఎప్పుడు విడుదల అయ్యాయో కూడా తెలియని పరిస్థితి ఉంది.
దీంతో కొరియన్ కనకరాజుపై ఆశలు పెట్టుకున్నాడు. దీనికి తగ్గట్టుగానే హారర్ కామెడీ జానర్ ను ఎంచుకున్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీకి కూడా ఓ హిట్ అవసరం. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో డెబ్యూ హిట్ కొట్టిన ఈ దర్శకుడి నుంచి ఆ స్థాయి హిట్స్ రాలేదు. మేస్ట్రో ఫర్వాలేదనిపించుకుంది. లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ దీ అదే పరిస్థితి. వీరిద్దరి కాంబో ఎలా ఉండబోతోందనేది తెలుసుకోవడానికి సమ్మర్ వరకు వెయిట్ చేయక తప్పదు.












Click it and Unblock the Notifications