విజయ్ కు మాంచి దమ్మున్న సినిమా చూపించారు కదరా
Jana Nayagan Vijay: ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ కు అభిమానులు షాకిచ్చారు. ఆదివారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో అభిమానుల తాకిడితో ఆయన కింద పడిపోయారు. మలేషియా నుండి తిరిగి వచ్చిన ఆయనను చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ఆయనను చుట్టుముట్టారు. ఫొటోల కోసం ఎగబడ్డారు. వ్యక్తిగత భద్రత సిబ్బంది సైతం వారిని అడ్డుకోలేకపోయారు. అభిమానుల మధ్య తోపులాటతో విజయ్ కిందపడ్డారు.
దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి విజయ్ బయటికి వచ్చిన వెంటనే ఆయనను అభిమానులు చుట్టుముట్టడాన్ని ఈ వీడియోల్లో చూడొచ్చు. కారు ఎక్కడానికి వస్తోండగా.. మధ్యలోనే అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. క్షణాల్లో ఆయనను చుట్టూ చేరారు. వారి తాకిడికి ఆయన కింద పడ్డారు. వెంటనే భద్రతా సిబ్బంది ఆయనను పైకి లేపి, సురక్షితంగా వాహనంలోకి పంపారు.

TVK చీఫ్ విజయ్ మలేషియాలో జరిగిన 'జన నాయగన్' ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరై చెన్నైకి చేరుకున్నారు. ఈ నెల 27వ తేదీన కౌలాలంపూర్‌లోని బుకిత్ జలీల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్ష మంది అభిమానులు తరలివచ్చారు. దేశంలో అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన ఆడియో లాంచ్‌గా మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ ఈవెంట్ గుర్తింపు పొందింది. ప్రజా జీవితంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడానికి సినిమా రంగాన్ని వీడాలనే తన నిర్ణయాన్ని విజయ్ పునరుద్ఘాటించారు.
హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన 'జన నాయగన్' సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. అదే విజయ్ కేరీర్ లో చివరి చిత్రం కానుంది. సినిమాలకు పూర్తిగా దూరమైన నేపథ్యంలో అభిమానులు ఇదే చివరి అవకాశంగా భావించినట్టుంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆయనను కలుసుకోవడం గానీ, ఫొటోలు దిగడం గానీ కష్టతరమౌతుందనే ఉద్దేశంతో అభిమానులు ఆయన కోసం ఎగబడ్డారు.
తాజా విమానాశ్రయ సంఘటన ప్రముఖుల భద్రతపై ఆందోళనలను పెంచింది. ఇటీవలే నటి నిధి అగర్వాల్ ఓ మాల్‌లో అభిమానుల మధ్య చిక్కుకుపోయారు. దీని తర్వాత సమంత కూడా అదే తరహా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన పబ్లిక్ ఈవెంట్‌లో నటి సమంత ఇబ్బందులు పడ్డారు. తాజాగా విజయ్ ఎదుర్కొన్న ఘటన కూడా ప్రముఖులకు భద్రత కల్పించడంలో ఉన్న సవాళ్లను స్పష్టం చేస్తున్నాయి.
-
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications