విజయ్ ఘనవిజయంలో ప్రధాన పాత్ర పోషించిన సినిమాలు ఇవే

తమిళనాడు ఎన్నికల్లో ఊహకందనిరీతిలో సంచలన విజయం సాధించిన విజయ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఆయన సినిమాల్లోకి రావాలని ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయమేం కాదు. దాదాపు 12 సంవత్సరాల క్రితమే ఆయనకు ఆలోచన ఉంది. అందుకనుగుణంగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతి సినిమాలు చురకలు వేస్తుండేవారు. విజయ్ విజయానికి కారణమై, ఎన్నికల్లో ప్రజలపై అధిక ప్రభావం చూపించిన సినిమాల గురించి తెలుసుకుందాం.

1. సర్కార్: ప్రజలకు ఓటే వజ్రాయుధం అని నిరూపించింది (2018లో)

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'సర్కార్', భారత ఎన్నికల వ్యవస్థపై ఒక యుద్ధం అని చెప్పొచ్చు. విదేశాల్లో స్థిరపడిన ఒక కార్పొరేట్ దిగ్గజం, తన ఓటును ఎవరో దొంగిలించారని తెలిసి భారత్ రావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఒక్క ఓటు కూడా ప్రభుత్వ గమనాన్ని మార్చగలదని, ప్రజల బాధ్యత కేవలం ఓటు వేయడమే కాదని, ప్రశ్నించడం కూడా అని ఈ సినిమా చాటి చెప్పింది.

Vijay resounding success was shaped by a series of films that played a pivotal role in his rise to stardom

2. మెర్సల్: వైద్యం అనేది వ్యాపారం కాదు అని చెప్పింది (2017లో)

వైద్య రంగంలో సామాన్యుడు ఎదుర్కొంటున్న దోపిడీని 'మెర్సల్' సినిమా కళ్లకు కట్టింది. భారీ బడ్జెట్ ఆసుపత్రులు పేదల ప్రాణాలను ఎలా వ్యాపార వస్తువులుగా మారుస్తున్నాయో ఇందులో చూపించారు. కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై చర్చను లేవనెత్తిన ఈ సినిమా, ప్రభుత్వ వైద్య రంగం బలోపేతం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

3. కత్తి: రైతే రాజు.. కానీ నేడు ఏంటి అని ప్రశ్నించింది (2014లో)

రైతుల ఆత్మహత్యలు, కార్పొరేట్ కంపెనీలు నీటి వనరులను, భూములను ఎలా ఆక్రమిస్తున్నాయో 'కత్తి' చిత్రం ద్వారా విజయ్ అద్భుతంగా ఆవిష్కరించారు."మనం తింటున్న అన్నం వెనుక ఒక రైతు కష్టం, కన్నీరు ఉన్నాయి" అనే సత్యాన్ని ఈ సినిమా మరోసారి గుర్తుచేసింది. ఇది విజయ్‌ను సామాన్య ప్రజలకు మరింత దగ్గర చేసింది. దీనికి ఏ.ఆర్.మురుగదాస్ దర్శకుడు.

4. తుపాకి: అజ్ఞాత వీరులకు నీరాజనాలు పలికింది (2012లో)

ఆర్మీ ఆఫీసర్‌గా విజయ్ తన నట విశ్వరూపం చూపిన చిత్రం 'తుపాకి'. స్లీపర్ సెల్స్ వల్ల దేశానికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడంలో సైనికుల ధైర్యసాహసాలను ఇందులో చూపారు.దేశ భద్రత అనేది కేవలం సైనికుల బాధ్యత మాత్రమే కాదు, అప్రమత్తంగా ఉండటం ప్రతి పౌరుడి ధర్మమని ఈ సినిమా సందేశాన్ని ఇచ్చింది. దీనికి ఏ.ఆర్.మురుగదాస్ దర్శకుడు.

5. మాస్టర్: యువత గమ్యం ఎటువైపు అని ప్రశ్నించింది? (2021లో)

బాల నేరస్థుల వ్యవస్థ లోని లోపాలను 'మాస్టర్' స్పృశించింది. మాదకద్రవ్యాల ముఠాలో చిక్కుకున్న పిల్లలను సరైన మార్గంలోకి తీసుకురావడంలో ఒక గురువు పాత్ర ఎలా ఉండాలో ఇందులో చూపించారు. యువత పెడదోవ పట్టకుండా ఉండాలంటే బలమైన నాయకత్వం, సరైన మార్గదర్శకత్వం అవసరమని ఈ సినిమా స్పష్టం చేసింది. దీనికి దర్శకుడు లోకేష్ కనగరాజ్

6. బిగిల్: మహిళా సాధికారత గురించి (2019లో)

మహిళా ఫుట్‌బాల్ జట్టు నేపథ్యంలో సాగే 'బిగిల్', క్రీడల్లో మహిళలు ఎదుర్కొనే వివక్షను, ఆసిడ్ దాడి బాధితుల ఆత్మవిశ్వాసాన్ని అద్భుతంగా చిత్రించింది.మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే వారు ఏదైనా సాధించగలరని, మహిళా సాధికారత అనేది కేవలం మాటల్లో కాకుండా చేతల్లో ఉండాలని ఈ చిత్రం చాటింది. దీనికి దర్శకుడు అట్లీ

విజయ్ తన సినిమాలను కేవలం బాక్సాఫీస్ రికార్డుల కోసమే కాకుండా, సామాజిక చైతన్యం కోసం కూడా ఉపయోగపడేలా తీశారు. మొదటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం తీసుకుంటూ వచ్చిన సినిమాలు కూడా ఈరోజు తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఘనవిజయానికి తోడ్పడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+