ఐఐటీ- బోంబే స్టూడెంట్స్‌కు బంపర్ ఆఫర్: కోటి రూపాయలకు పైగా ప్యాకేజీతో ఉద్యోగాలు
IIT Bombay students: ప్రతిష్ఠత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బోంబే విద్యార్థులు నక్కతోక తొక్కారు. కోట్ల రూపాయల సీటీసీతో ఉద్యోగాలను సాధించారు. 10 కాదు.. 20 కాదు ఏకంగా 85 మంది స్టూడెంట్స్ ఈ ఘనతను సాధించారు. సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా ప్యాకేజీని ఇచ్చి మరీ మల్టీ నేషనల్ కంపెనీలు వారిని ఎంపిక చేసుకున్నాయి.
2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన క్యాంపస్ ఇంటర్వ్యూలు ఐఐటీ- బోంబేలో ముగిశాయి. మొత్తంగా 388 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాయి. టాలెంట్ ఉన్న విద్యార్థులపై కనకవర్షాన్ని కురిపించాయి. కోట్ల రూపాయల మేర జాబ్ ఆఫర్స్ ఇచ్చాయి.

ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఐటీ, ఐటీ అనుబంధ, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫిన్‌టెక్, మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డిజైన్‌లలో అత్యధిక సంఖ్యలో జాబ్ ఆఫర్స్ లభించాయి. జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, సింగపూర్, హాంకాంగ్ కంపెనీల్లో 63 మంది విద్యార్థులు ఆఫర్లను పొందారు.
యాక్సెంచర్, ఎయిర్‌బస్, ఎయిరిండియా, యాపిల్, అర్థర్ డీ లిటిల్, బజాజ్, బార్క్లే, కోహెసిటీ, డావిన్సీ, డీహెచ్ఎల్, ఫుల్లెర్టన్, ఫ్యూచర్ ఫస్ట్, జీఈ-ఐటీసీ, గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్, గూగుల్, హోండా ఆర్ అండ్ డీ, ఐసీఐసీఐ-లొంబార్డ్, ఐడియాఫోర్జ్, ఐఎంసీ ట్రేడింగ్, ఇంటెల్, జాగ్వార్, ల్యాండ్ రోవర్.. వంటి కంపెనీలు ఇందులో ఉన్నాయి.
జేపీ మోర్గాన్ ఛేజ్, జేఎస్‌డబ్ల్యూ కోటక్ సెక్యూరిటీస్, మార్ష్ మెక్లెనన్, మహీంద్రా గ్రూప్, మైక్రోసాఫ్ట్, మోర్గాన్ స్టాన్లీ, మెర్సిడెస్-బెంజ్ , ఎల్ అండ్ టీ, ఎన్‌కే సెక్యూరిటీస్, ఓలా, పీ అండ్ జీ, క్వాల్ కామ్, రిలయన్స్ గ్రూప్, శాంసంగ్, ష్లెంబెర్జర్, స్ట్రాన్ లైఫ్ సైన్సెస్, టాటా గ్రూప్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, టీఎస్ఎంసీ, టీవీఎస్ గ్రూప్, వెల్స్ ఫార్గో కంపెనీలు స్టూడెంట్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి.
మొత్తంగా ఈ సీజన్‌లో నిర్వహించిన క్యాంపస్ సెలెక్షన్లల్లో సగటున ఒక్కో విద్యార్థి సంవత్సరానికి 36.9 లక్షల రూపాయల చొప్పున ప్యాకేజీని తీసుకున్నారు. గత సీజన్‌తో పోల్చుకుంటే ఈ మొత్తం అధికం. ఇదివరకు సగటున 32.25 లక్షల రూపాయల ప్యాకేజీకి ఎంపిక అయ్యారు. ఈ దఫా ఈ సంఖ్య పెరిగింది.












Click it and Unblock the Notifications