AAI భారీ నోటిఫికేషన్:ఆ పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్-జీతం ఎంతో తెలుసా..?

న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ - ATC) విభాగంలో మొత్తం 309 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు AAI అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలోని విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, నిర్వహించడం బాధ్యత వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది.

aai-junior-executive-recruitment-2025-apply-online-for-309-atc-posts-eligibility-dates

ముఖ్యమైన తేదీలు:

  • నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 4, 2025
  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఏప్రిల్ 25, 2025
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 24, 2025

AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2025 (02/2025/CHQ) నోటిఫికేషన్ PDF ఫైల్‌ను ఏప్రిల్ 4, 2025న అధికారిక వెబ్‌సైట్ https://aai.aero లో అందుబాటులో ఉంచింది. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ PDF ను పూర్తిగా చదివి అర్హత ప్రమాణాలు మరియు ఇతర వివరాలు తెలుసుకోవచ్చు.

ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 25, 2025 నుండి మే 24, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. దరఖాస్తు లింక్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో అందుబాటులో ఉంచనున్నారు.

దరఖాస్తు రుసుము:
దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ విధానంలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, మరియు ఇతర ఆన్‌లైన్ చెల్లింపు విధానాల ద్వారా రుసుము చెల్లించవచ్చు. బ్యాంకు లావాదేవీల ఛార్జీలను అభ్యర్థులే భరించాలి.

విద్యార్హతలు:
ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్‌తో సైన్స్‌లో (B.Sc) మూడు సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.డిగ్రీలో ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు కనీసం ఒక సెమిస్టర్ సిలబస్‌లో అయినా చదివి ఉండాలి.

వేతన వివరాలు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు దాదాపు రూ. 13 లక్షల వేతనం ఉంటుంది. దీంతో పాటు డీఏ, ఇతర అలవెన్సులు, హెచ్‌ఆర్‌ఏ, CPF, గ్రాట్యుటీ, వైద్య ప్రయోజనాలు మరియు ఇతర సౌకర్యాలు సంస్థ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.మరింత సమాచారం కోసం AAI అధికారిక వెబ్‌సైట్ https://aai.aero ను సందర్శించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+