AIIMS Recruitment 2025: భారీగా ఉద్యోగాలు.. అప్లై చేశారా..?

ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)లో ఉద్యోగాలను సాధించాలని ఉందా.. అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిమ్స్ నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 4,576 ఉద్యోగాల భర్తీకి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రూప్ బీ, గ్రూప్ సీ తోపాటు ఫార్మాసిస్ట్ లు, నర్సింగ్, పబ్లిక్ హెల్త్ నర్సెస్, అసిస్టెంట్ ఇంజినీర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, మల్టీటాస్కింగ్ స్టాఫ్.. తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పోస్టుల సంఖ్య, అప్లై విధానం, అప్లికేషన్ ఫీజు, వయోపరిమితి తదితర వివరాలు మీకోసం..

మొత్తం పోస్టుల సంఖ్య : 4576
అప్లికేషన్ విధానం : గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులతో పాటు అన్ని రకాల పోస్టులకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ప్రారంభం : జనవరి 7
అప్లికేషన్ చివరి తేదీ : జనవరి 31

AIIMS Announces 4576 Job Openings Apply by January 31st

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు

జనరల్, ఓబీసీ విద్యార్థులు : రూ. 3వేలు
ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు : 2 వేలు
ఫీజును ఆన్ లైన్ లో పే చేయాలి.

వయోపరిమితి

కనిష్ట వయసు 18 సంవత్సరాలు కాగా గరిష్ట వయసు 35 సంవత్సరాలు. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితి పొడిగింపు కూడా ఉంది.

అర్హతలు:

పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లోమా సర్టిఫికెట్ ఉన్నవారు అర్హులు

అప్లై విధానం

అభ్యర్థులు ఎయిమ్స్ అధికారిక సైట్ లోకి వెళ్లాలి. వ్యక్తిగత ఆధారాలు పొందుపరిచి రిజిస్ట్రేషన్ ఫామ్ ను నింపాలి. యూనిక్ రిజిస్ట్రేషన్ ఐడీ వస్తుంది. ఆ ఐడీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపాలి. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో పే చేయాలి. ఆ తర్వాత అప్లై ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+