AIIMS : ఎయిమ్స్ మంగళగిరి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో కాంట్రాక్టు పద్దతిన 125 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. 125 ఫ్యాకల్టీ గ్రూప్-ఏ పోస్టుల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది.
ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 29, 2024. హార్డ్ కాపీల స్వీకరణకు ఫిబ్రవరి 8, 2024 చివరితేదిగా పరిగణించడమైనది.

మొత్తం పోస్టుల వివరాలు - 125
ప్రొఫెసర్ పోస్టులు : 20 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు : 73 పోస్టులు
అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులు : 10 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు : 22 పోస్టులు
ఇతర పూర్తి వివరాలు..
విద్యార్హత : సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ, ఎండీ/ ఎంఎస్/ ఎంసీహెచ్/ డీఎం ఉత్తీర్ణతతో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
వయసు : ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ ఖాళీలకు 58 ఏళ్లు ఇతర పోస్టులకు 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ : ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఈ కింద ఉన్న అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోగలరు.
అడ్రస్ : ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్, రిక్రూట్‌మెంట్ సెల్, రూం నంబర్ 216, 2వ అంతస్తు, లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్, మంగళగిరి, గుంటూరు చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్న పోస్టులు : అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోస్టాటిస్టిక్స్, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సైకియాట్రీ వంటి విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులకు ఎంపిక చేయు ప్రక్రియ : ఇంటర్య్వూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
శాలరీ : ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.2,18,200 వరకూ ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 29, 2024.
హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 8, 2024.
పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఈ వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in/ను సంప్రదించగలరు.












Click it and Unblock the Notifications