Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Air Force Recruitment 2025 : భారీ వేతనంతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు.. ర్యాలీ ఆ రోజు నుంచే..!

దేశంలోనే ప్రతిష్టాత్మక రంగాల్లో ఎయిర్ ఫోర్స్ ఒకటి. ఎయిర్ ఫోర్స్ లో జాబ్ సాధించాలని ఎంతోమంది యువత కలలు కంటుంటారు. అలాంటివారికి ఇదొక సువర్ణావకాశం. ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ వై నాన్ టెక్నికల్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ విభాగంలో పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి సంబంధించిన ర్యాలీ జనవరి 29 నుంచి కేరళలోని కొచ్చిలో ప్రారంభం కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ప్రతిష్టాత్మక ఎయిర్ ఫోర్స్ సంస్థ. ఈ సంస్థలోని ఎయిర్ మెన్ గ్రూప్ వై నాన్ టెక్నికల్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ విభాగంలో నియామకాలకు నోటిఫికేషన్ జారీ అయింది. రిక్రూట్ మెంట్ లో భాగంగా ర్యాలీ కేరళలోని కొచ్చిలో నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న ఏపీ, తెలంగాణ విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు.

Air Force Issues Notification for Airmen Rally Starting January 29 in Kochi

విద్యార్హత

ఇంటర్మీడియట్ లో బీఎస్సీ, డిప్లోమా పూర్తిచేసినవాళ్లు ఇందులో పోటీ పడొచ్చు. ఫిజికల్ టెస్టులు, రాత పరీక్ష, మెడికల్ టెస్టులు కూడా ఉంటాయి. వీటిలో సెలక్ట్ అయిన అభ్యర్థులకు శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత ఎయిర్ మెన్ గా తొలి నెల నుంచే రూ. 50 వేలకు పైగా జీతం అందుకునే అవకాశం ఉంది.

ర్యాలీ ఎక్కడంటే..?

ఎయిర్ మెన్ పరీక్షలో భాగంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు కేరళలోని కొచ్చి ఎర్నాకుళం షెనాయ్స్ పీటీ ఉషా రోడ్​, మహారాజా కాలేజ్‌ గ్రౌండ్​లో గ్రూప్‌ వై నాన్‌ టెక్నికల్‌ మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌ నియామకాల్లో ర్యాలీ జరగనుంది. ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులే అర్హులు. ఇంటర్ పూర్తిచేసుకున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు. కానీ ఫిబ్రవరి ఒకటో తేదీనే రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని ఎయిర్ ఫోర్స్ సంస్థ నోటిఫికేషన్ లో పేర్కొంది.

ర్యాలీకు ఏం తీసుకెళ్లాలి..?

డీ ఫార్మసీ, బీ ఫార్మసీ వాళ్లైతే ఫిబ్రవరి 4, 5 తేదీల్లో ర్యాలీలో పాల్గొనాలి. అయితే వీళ్లు ఫిబ్రవరి 4న రిపోర్ట్​ చేయాలి. ఆ తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల్లోపు అభ్యర్థుల వివరాలు అందించాలి. కావాల్సిన ఒరిజినల్‌ సర్టిఫికేట్స్, వాటి జిరాక్స్​లు, ఫొటోలు, పరీక్షకు కావాల్సిన వాటిని తీసుకెళ్లాలి.

వయోపరిమితి

ఇంటర్‌ అర్హతతో అయితే జులై 3, 2004 - జులై 3, 2008 మధ్య జన్మించినవారే అర్హులు. ఫార్మసీ చేసినవారైతే జులై 3, 2001 - జులై 3, 2006 మధ్య జన్మించాలి.

ఎంపిక ప్రక్రియ

ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్​లు ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు

ఫిజికల్‌ ఫిట్‌నెస్‌లో భాగంగా 1.6 కిలో మీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉంటుంది. 21 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారైతే 7 నిమిషాల 30 సెకన్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. అలాగే నిర్ణీత వ్యవధిలో 10 సిట్‌అప్స్, 10 పుష్‌అప్స్, 20 స్క్వాట్స్‌ పూర్తిచేయాలి.

రాత పరీక్ష

ఈ రాత పరీక్షను ఫిజికల్‌ ఫిట్‌నెస్‌లో ఉత్తీర్ణులైన వారికే అదే రోజు నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌(మల్టిపుల్ ఛాయిస్డ్ క్వశ్చన్స్​) విధానంలో ఉంటాయి. ఇంగ్లిష్‌ పరీక్ష తప్ప మిగతా ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. సమాధానాలు ఓఎంఆర్‌ షీట్​పై గుర్తించాలి. పరీక్ష కాలం 45 నిమిషాలు ఉంటుంది. ఇంగ్లిష్, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ వంటి సబ్జెక్టుల్లో ప్రశ్నలుంటాయి. 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ఇంగ్లిష్‌ సబ్జెక్టు ప్రశ్నలు సీబీఎస్‌ఈ 10+2 సిలబస్‌ నుంచే వస్తాయి. ఇంగ్లిష్‌ 20, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. ఈ రెండు విభాగాల్లోనూ తప్పని సరిగా మినిమమ్​ మార్కులు రావాలి.

అడాప్టబిలిటీ టెస్టు

రాత పరీక్షలో ఉత్తీర్ణత అయినవారికి అడాప్టబిలిటీ పరీక్ష నిర్వహిస్తారు. ఎయిర్‌ ఫోర్స్‌ వాతావరణానికీ, ఆ ఉద్యోగానికీ అభ్యర్థి సూట్​ అవుతాడో లేదో తెలుసుకోవడానికి ఆబ్జెక్టివ్‌ తరహాలో రాత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులోనూ ఉత్తీర్ణత సాధిస్తే మెడికల్​ పరీక్షలు నిర్వహించి ట్రైనింగ్ కోసం ఎంపిక చేస్తారు. ఎంపికైనవారి వివరాలు మే 30 2025న ప్రకటిస్తారు.

ట్రైనింగ్

ర్యాలీలో ఉత్తీర్ణత సాధించినవారికి వాయుసేన ప్రాథమిక శిక్షణ కేంద్రంలో తర్ఫీదు నిర్వహిస్తారు. అనంతరం అభ్యర్థులను సంబంధిత ట్రేడ్‌ ట్రైనింగ్ సెంటర్లకు పంపుతారు. శిక్షణ సమయంలో రూ.14,600 స్టైఫండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని అనంతరం డ్యూటీలోకి తీసుకుంటారు. వీరు 20 ఏళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని తమకు నచ్చిన వారు 57 ఏళ్ల వయసు నిండే వరకూ పొడిగించుకోవచ్చు.

మొదటి నెల నుంచే మిలటరీ సర్వీస్‌ పే తో కలిపి రూ.26,900 జీతం అందుతుంది. అన్ని రకాల అలవెన్సులూ కలిపి సుమారు రూ.50 వేల వేతనం ఖాతాలో జమ అవుతుంది. మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌లో చేరినవారు ఫస్ట్‌ ఎయిడ్‌ చేయగలిగేలా దానిపై అవగాహన పెంచుకుంటారు. మెడికల్‌ స్టోర్లు, డిస్పెన్సరీ, వార్డు పర్యవేక్షణ వీరి డ్యూటీలో భాగం. విధుల్లో చేరాక అనుభవాన్ని బట్టి భవిష్యత్తులో ప్రమోషన్ల ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.

ఎత్తు

కనీసం 152 సెంటి మీటర్లు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ వ్యత్యాసం కనీసం 5 సెంటి మీటర్లు. కంటికి దృష్టిదోషం ఉండరాదు. చెవుల వినికిడి సామర్థ్యం స్పష్టంగా ఉండాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+