ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్...ఆర్‌టీసీలో 7,545 ఉద్యోగాలు..
ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్‌టీసీలో 7,545 ఉద్యోగాల భర్తీకీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో మెగా డీఎస్సీ ప్రకటించిన కూటమీ ప్రభుత్వం.. నిరుద్యోగులకు త్వరలోనే మరో గుడ్‌న్యూస్‌ను అందించేందుకు సిద్ధమయ్యింది. ఏపీఎస్ఆర్‌టిసీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆర్‌టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమచారం. ఈ క్రమంలో ఆర్‌టీసీలోని మొత్తం 18 కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అధికారులు గుర్తించారు. ఈ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏపీలోని కూటమి ప్రభుత్వానికి సమర్పించింది.
ఆర్‌టీసీ సంస్థలో మొత్తం 18 కేటగిరిల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్‌టీసీ తెలిపింది. ఇందులో 3,673 రెగ్యులర్ డ్రైవర్ పోస్టులు ఉండగా, 1,813 కండక్టర్ పోస్టులు, 579 అసిస్టెంట్ మెకానిక్‌తో పాటు శ్రామిక్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు 207 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీలు పోస్టులు, 179 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీల పోస్టులు, 280 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు, 656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖాళీల భర్తీపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఏపీఎస్ఆర్‌టిసీలో ఒకేసారి పెద్దత్తున ఉద్యోగాల నియామకాలు చేపట్టేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోన్నట్లు తెలుస్తోంది.

డీఎస్సీ పోస్టులపై ప్రభుత్వం కసరత్తు..
ఇక, రాష్ట్రంలో 16,347 మెగా డీఎస్సీ DSC ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆయా జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు పరిశీలించి నివేదిక పంపించాలని ఇప్పటికే డీఈవోలను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. గతంలో జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు, అలాగే, రోస్టర్ పాయింట్లు, సమాంతర రిజర్వేషన్లు, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్, స్పోర్ట్స్ కోటా అమలుపై పూర్తి వివరాలను ఈ నెల (అక్టోబర్) 28వ తేదిలోగా పంపాలని ఆదేశించింది. అయితే, మెగా డీఎస్సీపై రాష్ట్రంలో వచ్చే నెల (నవంబర్) మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications